సంతానం కోసం ఏ వత్తులతో దీపారాధన చేయాలో తెలుసా?- Interesting Facts About Deeparadhana

interesting facts about deeparadhana, Hindu tradition, అరటి నార వత్తులతో దీపారాధన , సంతానం,దీపారాధన - Telugu Hindu Tradition, అరటి నార వత్తులతో దీపారాధన, దీపారాధన, సంతానం

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం మన ఇంటిని శుభ్రపరచుకుని మన ఇంట్లో ఉన్న పూజగదిని అలంకరించుకొని పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది.అయితే కొందరు కొన్నిరకాల నూనెలతో, వత్తులతో పూజలు చేస్తూ ఉంటారు.

 Interesting Facts About Deeparadhana-TeluguStop.com

అయితే ఏ దేవునికి ఏ వత్తులను ఉపయోగించి దీపారాధన చేయాలి అనే విషయాలు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.అయితే ఇప్పుడు ఏ దేవునికి ఏ వత్తులను ఉపయోగించి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ఎక్కువ మంది ఇళ్లల్లో పత్తి తో తయారు చేసిన వత్తులను ఉపయోగిస్తుంటారు.

 Interesting Facts About Deeparadhana-సంతానం కోసం ఏ వత్తులతో దీపారాధన చేయాలో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా పత్తితో చేసిన వత్తులను ఉపయోగించి దేవునికి దీపారాధన చేయటం వల్ల పితృదేవతలకు ఉండే దోషాలు తొలగిపోతాయి.అదేవిధంగా తామర తూడులతో తయారు చేసిన వత్తులు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

పెళ్లయి సంతానం కలగనివారు సంతానం కోసం అరటి నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Telugu Hindu Tradition, అరటి నార వత్తులతో దీపారాధన, దీపారాధన, సంతానం-Telugu Bhakthi

అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగి పోవాలంటే జిల్లేడు వత్తులతో శ్రీ గణపతికి పూజ చేయాలి.కుంకుమ నీటిలో తడిపిన బట్టతో తయారు చేసిన వత్తులను వెలిగించడం ద్వారా వైవాహిక జీవితంలో ఏర్పడిన చింతలు తొలగిపోవడమే కాకుండా, మన ఇంటిపై శత్రువులు ప్రయోగం చేసిన మాంత్రిక శక్తులు కూడా పనిచేయవు.

కొబ్బరి నూనెతో ప్రతి రోజూ మన ఇంట్లో దీపారాధన చేయడం వల్ల శుభకార్యాలు తొందరగా జరుగుతాయి.

కుజదోషం ఉండి వివాహం కాని వారు మంగళవారం రోజు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పప్పుతో తయారు చేసిన బొబ్బట్లును నైవేద్యంగా ఆ దేవునికి సమర్పించి 11మంది ముత్తైదువులకు వాయన ఇవ్వడం ద్వారా కుజదోషం తొలగిపోయి వివాహ ఘడియలు దగ్గర పడతాయని పండితులు చెబుతున్నారు.

#Hindu Tradition

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL