ఆడపిల్లలకు వివాహ దోషం పోవాలంటే చేయాల్సిన పరిహారం?

వివాహమనేది ప్రతి ఒక్కరి కొత్త జీవితానికి నాంది.అయితే కొంత మందిలో జాతక దోషాలు ఉండటం వల్ల వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది.

 Interesting Facts About Deeparadana Rules Girls, Marriage Error, Ghee Lamps, Nav-TeluguStop.com

ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ వివాహం కుదరక ఎంతో బాధపడుతుంటారు.ముఖ్యంగా ఆడపిల్లలలో వివాహ దోషం ఉంటే దోషం తొలగిపోవడానికి ఏ విధమైన పరిహారం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

వివాహ దోషమున్న అమ్మాయిలు ఏ ఆలయంలోనైనా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఏడు ఎర్రటి ప్రమిదలు తీసుకొని నేతి దీపం వెలిగిస్తే వివాహ దోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా ఏడు మంగళ వారాలు లేదా ఏడు శుక్రవారాలు చేయాలి.

ఈ విధంగా చేసినప్పుడే దోష పరిహారం జరుగుతుంది.అదేవిధంగా వివాహితులు తొమ్మిది వారాల పాటు ఈ విధంగా చేయటం వల్ల వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది.

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఒక ఎర్రని ప్రమిదతో ఏడు వారాల పాటు దీపం వెలిగించాలి.వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధించాలనే వారు మూడు దీపాలను వెలిగించాలి.

నాలుగు దీపాలు వెలిగించడం వల్ల గృహం, వాహనాలను కొనుగోలు చేస్తారు. 7 ప్రమిదలను వెలిగించడం వల్ల వివాహ దోషం తొలగిపోతుంది.8 ఎర్రటి ప్రమిదలను కలిగించడం ద్వారా శతృభయాలు తొలగిపోతాయి.

నవగ్రహ దోషాలతో బాధపడేవారు తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 108 ప్రమిదలతో వెలిగిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.508 ప్రమిదలతో దీపం వెలిగిస్తే వారికి వివాహ దోషాలు తొలగిపోయి మంచి జీవితం ఏర్పడుతుంది.అదేవిధంగా సంతానం లేనివారు 1008 ప్రమిదలను వెలిగించడం ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Interesting Facts About Deeparadana Rules Girls

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube