దాసరి మరణం విషయంలో ఆ విధంగా జరిగిందా.. అలా చనిపోయారంటూ?

ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో దాసరి నారాయణరావు ఒకరనే సంగతి తెలిసిందే.రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకునిగా దాసరి నారాయణరావు గుర్తింపును సంపాదించుకున్నారు.150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు 53 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో దాసరి నారాయణరావు నటించారు.

 Interesting Facts About Dasari Narayana Rao Death Details Here , Dasari Death , Tollywood Star Director, Raja Vannem Reddy,congress Party,dasari Narayanarao , Senior Ntr, Shocking Facts , Interesting Facts About Dasari Narayana-TeluguStop.com

ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులను దాసరి నారాయణరావు పరిచయం చేశారు.సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఉపయోగపడ్డాయి.పలు సినిమాలలో దాసరి నారాయణరావు నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా ఎన్నో అవార్డులను దాసరి నారాయణరావు సొంతం చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు దాసరి నారాయణరావు ఎంపికయ్యారు.2017 సంవత్సరం మే నెల 30వ తేదీన దాసరి నారాయణరావు మరణించారు.ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మానందం అత్తిలిలో లెక్చరర్ గా పని చేశారని తెలిపారు.క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ఎడిటర్ మోహన్ వల్లే హిట్టైందని చాలామంది భావించారు.

 Interesting Facts About Dasari Narayana Rao Death Details Here , Dasari Death , Tollywood Star Director, Raja Vannem Reddy,Congress Party,dasari Narayanarao , Senior NTR, Shocking Facts , Interesting Facts About Dasari Narayana-దాసరి మరణం విషయంలో ఆ విధంగా జరిగిందా.. అలా చనిపోయారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాసరి గారి మరణం గురించి రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ దాసరి మృతి విషయంలో ఎలాంటి మిస్టరీ లేదని ఆయన తెలిపారు.ఆయన అజాగ్రత్తే మృతికి కారణమని రాజా వన్నెంరెడ్డి అన్నారు.ఆయన కొత్త విధానంలో చేయించుకున్న చికిత్స ఎఫెక్ట్ చూపడంతో ఆయన మరణించారని రాజా వన్నెంరెడ్డి పేర్కొన్నారు.దాసరి నారాయణరావు మరణం అభిమానులకు తీరని లోటు అనే సంగతి తెలిసిందే.

ఎంతోమంది బ్యాగ్రౌండ్ లేని నటులను వెండితెరకు పరిచయం చేసి ఆయన వాళ్లు కెరీర్ లో సక్సెస్ కావడానికి కారణమయ్యారు.దాసరి నిర్మించిన సినిమాలకు సైతం అవార్డులు దక్కాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube