ఏఎన్నార్ దాన వీర శూర కర్ణ సినిమాలో నటించకపోవడానికి అసలు కారణమిదే?

పౌరాణిక సినిమాగా తెరకెక్కి తెలుగులో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సినిమాగా దానవీర శూరకర్ణ సినిమాకు పేరుంది.1977 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం 10 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.1994 సంవత్సరంలో ఈ సినిమా రెండోసారి విడుదలైంది.

 Interesting Facts About Danaveera Soora Karna Movie Details, Senior Ntr, Danavee-TeluguStop.com

రెండోసారి రిలీజైన సమయంలో కూడా ఈ సినిమా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.సీనియర్ ఎన్టీఆర్ శ్రమ ఫలితం వల్ల ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.4 గంటల 17 నిమిషాల నిడివితో రిలీజైన ఈ సినిమాలో అర్జునుని పాత్రలో నందమూరి హరికృష్ణ నటించగా అభిమన్యుని పాత్రలో బాలకృష్ణ నటించారు.ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ నటించిన 248వ సినిమా కావడం గమనార్హం.

ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ, హరికృష్ణలకు సీనియర్ ఎన్టీఆర్ మేకప్ వేయడం గమనార్హం.

Telugu Balakrishna, Cmjalagam, Danaveerasoora, Hari Krishna, Historical, Karna R

సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు.ఈ మూవీలో శ్రీ కృష్ణుడు లేదా కర్ణుడు పాత్రలో నటించాలని సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ను కోరారు.

శ్రీకృష్ణుడి పాత్ర తాను చేయనని ఎన్టీఆర్ ను చూసిన కళ్లు ఆ పాత్రలో తనను చూడలేవని ఏఎన్నార్ సీనియర్ ఎన్టీఆర్ తో చెప్పారు.

Telugu Balakrishna, Cmjalagam, Danaveerasoora, Hari Krishna, Historical, Karna R

తాను కర్ణుడి పాత్రలో నటిస్తే పాండవులు కూడా మరుగుజ్జులలా కనిపిస్తారని అందువల్ల ఆ పాత్రలో కూడా తాను నటించలేనని ఏఎన్నార్ వెల్లడించారు.అప్పటి సీఎం జలగం వెంగళరావు ఎన్టీఆర్ కోరిక మేరకు ఏఎన్నార్ ను ఆ సినిమాలో నటించాలని కోరారు.అయితే ఏఎన్నార్ మాత్రం తాను ఆ పాత్రలలో నటించలేనని సున్నితంగా తిరస్కరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube