సినిమాల్లోకి రాకముందు రాహుల్ రామకృష్ణ ఏ పని చేసేవారంటే.?

ఈ మధ్య కాలంలో కమెడియన్ గా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న వారిలో రాహుల్ రామకృష్ణ ఒకరు.ఈ నెల 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమాతో రాహుల్ రామకృష్ణ మరోసారి కడుపుబ్బా నవ్వించారు.

 Interesting Facts About Comedian Rahul Ramakrishna,jathi Rathanalu,srrkaram,gali-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రాహుల్ రామకృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సినిమాలో తాను రవి పాత్రలో నటించానని ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని రాహుల్ రామకృష్ణ తెలిపారు.

ఈ సినిమా కథ విన్న సమయంలో తనకు నవ్వు ఆగలేదని కథను బాగా ఎంజాయ్ చేశానని.జాతిరత్నాలు కథ నచ్చినా ఈ సినిమా ఆడియన్స్ కు నచ్చుతుందా.? లేదా.? అనే అనుమానాలు ఉండేవని ప్రేక్షకుల స్పందన చూసిన తరువాత సినిమా విషయంలో తనకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని రాహుల్ రామకృష్ణ తెలిపారు.తనకు ప్రియదర్శితో గత 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని జాతిరత్నాలు సినిమాతోనే నవీన్ పోలిశెట్టితో పరిచయం ఏర్పడిందని రాహుల్ రామకృష్ణ వెల్లడించారు.

హ్యూమర్ జాతిరత్నాలు సినిమాకు స్ట్రెంత్ అని సినిమాలో పాత్రల మధ్య కథ పెద్దగా లేకపోయినా హాస్యం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు.

తాను సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పని చేశానని రాహుల్ రామకృష్ణ తన గురించి ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించారు.సినిమా రిపోర్టర్ అవ్వాలని భావించి ఇండస్ట్రీకి వచ్చిన తాను చివరకు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్నానని వెల్లడించారు.

మరోవైపు జాతిరత్నాలు సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.శివరాత్రి పండుగకు విడుదలైన అన్ని సినిమాలలో ఈ సినిమాకే భారీగా కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.

ఈ సినిమాకు పోటీగా విడుదలైన శ్రీకారం సినిమాకు పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా గాలిసంపత్ సినిమాకు మాత్రం దారుణంగా కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube