అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ సిబ్బంది మనకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు.దొంగలున్నారు జాగ్రత్త మీ వస్తువులను మీరే బాధ్యత అంటూ ఆలయ సిబ్బంది భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.

 Unknown Interesting Facts About Chudamani Temple Of Uttarakhand, Chudamani Templ-TeluguStop.com

అదేవిధంగా ఆలయంలో ఏ విధమైనటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం భక్తుల పై నిఘా ఉంచడానికి ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఉంటారు.సాధారణంగా అన్ని ఆలయాలలోనూ ఇదే తంతు కొనసాగుతోంది.

కానీ ఒక్క ఆలయం మాత్రం అందుకు భిన్నం ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా దొంగతనం చేయాల్సిందే.అయితే ఆ భక్తులు దొంగతనం చేసినప్పుడే అమ్మవారి అనుగ్రహం వారిపై కలుగుతుందని అక్కడి పూజారులు తెలియజేస్తారు.

ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశిష్టత ఏమిటి? దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ బాధ్యత చూడియాలాలో ఉంది.

 ఇక్కడ చూడామణి ఆలయం ఉంది.ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయానికి వచ్చిన భక్తులు పై అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాల్సి ఉంటుంది.దొంగతనం అంటే ఇతరుల డబ్బులను నగలను కాదండోయ్.

అమ్మవారి పాదాల చెంత ఉన్నటువంటి చెక్క బొమ్మలను దొంగతనం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.అందుకోసమే ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు.

పూర్వకాలంలో ఒక రాజు వేటకు వెళ్లి అలసిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సందర్శించి తనకు సంతానం కలగాలని కోరుకున్నారు.

Telugu Chudamani, Devotional, Male Child, Rourkee, Santana Temple, Telugu Bhakth

ఈ క్రమంలోనే అమ్మవారు మాయమయి చెక్క విగ్రహంగా మారింది.అపుడు ఆ రాజు ఆ చెక్క బొమ్మను తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్ళడంతో తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విధంగా తనకు సంతానం కలిగిన తర్వాత తిరిగి వచ్చి ఆ చెక్క బొమ్మను అక్కడే ఉంచి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ చరిత్ర చెబుతుంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి చెక్క బొమ్మను తీసుకెళ్తారు.అలాగే వారికి సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మ తో పాటు మరొక చెక్క బొమ్మను తీసుకువచ్చి అక్కడ ఉంచడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube