చరణ్, బన్నీ మేకప్ మేన్ ఇతనే. ఇతని గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస విజయాలతో స్టార్ హీరోగా కెరీర్ పరంగా దూసుకెళుతున్నారు.అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ విజయాలతో అన్ని భాషల్లో క్రేజ్ పెంచుకున్న బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో ఆ సినిమాలను మించిన విజయాన్ని సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

 Interesting Facts About Charan Bunny Makeup Man Sandy Artist Details, Bunny, Cha-TeluguStop.com

బన్నీ తర్వాత సినిమాల దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను మరి కొందరు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా బన్నీ మాత్రం కొత్త ప్రాజెక్ట్ ల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే బన్నీ ప్రతి సినిమాలో అందంగా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

సాధారణంగానే బన్నీ అందగాడు కాగా మేకప్ మేన్ సినిమాలలో బన్నీని మరింత అందంగా చూపిస్తారు.బన్నీ మేకప్ మేన్ లలో ఒకరైన సందీప్ ను మరి కొందరు శాండీ ఆర్టిస్ట్ అని పిలుచుకుంటారు.

చాలా టాలెంటెడ్ అయిన సందీప్ యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా, వాయిస్ యాక్సెంట్ ట్రైనర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు.

బాల్యం నుంచి ఫ్యాషన్ పై ఆసక్తి ఉన్న సందీప్ ఏం చేసినా ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారని సమాచారం.

Telugu Sandy Artist, Allu Arjun, Bunny, Charan, Sandeep, Ram Charan, Sandeep Mol

మ్యాస్ట్రో ముస్తఫా దగ్గర శిక్షణ తీసుకున్న సందీప్ ఐ యామ్ అనే సినిమాకు పని చేయడం ద్వారా మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.సొంతంగా ఈవెంట్లు చేసే రేంజ్ కు సందీప్ ఎదిగారు.ఆ తర్వాత సౌత్ ఇండియా ఫిల్మ్ సెలబ్రిటీలకు సందీప్ మేకప్ మేన్ గా మారారు.

Telugu Sandy Artist, Allu Arjun, Bunny, Charan, Sandeep, Ram Charan, Sandeep Mol

చరణ్, బన్నీలతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలకు మేకప్ మేన్ గా సందీప్ పని చేశారు.సందీప్ పనితనం అద్భుతంగా ఉంటుందని పలువురు సెలబ్రిటీలు సైతం ప్రశంసించడం గమనార్హం.అయితే సందీప్ అమ్మను మించిన బ్యూటీషియన్ ఉండరని వంటింటి చిట్కాలు సురక్షితం అని కెమికల్స్ తో చర్మాన్ని నాశనం చేసుకోవద్దని అలంకరణను ఇష్టపడే అమ్మాయిలకు నా సలహా ఇదేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube