తంజావూరు బృహదీశ్వరాలయంలో దాగిఉన్న రహస్యాలేమిటో తెలుసా?

మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలకు నిలయం.ఇటువంటి పురాతన ఆలయాలకు ప్రసిద్ధిగాంచినది తంజావూరు.

 Interesting Facts About Brihadeeswara Temple-TeluguStop.com

తంజావూరుకు ఆ పేరు తంజన్ అనే పదం నుంచి ఉద్భవించింది.హిందూ మత పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు శివుని చేతిలో హతం కావడంవల్ల అతని పేరు మీదుగా, అతని చివరి కోరికగా దీనికి తంజావూరు అనే పేరు వచ్చింది.తంజావూరులోని బృహదీశ్వరాలయం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం.11వ శతాబ్దంలోనే చోళులు నిర్మించిన ఈ ఆలయంలో దాగిఉన్న ఎన్నో వింతలు, రహస్యాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

సుమారు వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే.కానీ బృహదీశ్వరాలయం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటి కాలంలో నిర్మించబడిన ఆలయంలా దర్శనమిస్తుంది.భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు.13 అంతస్తులు కలిగిన ఈ ఆలయం నిర్మించడం కోసం ఏ విధమైనటువంటి ఉక్కు లేదా సిమెంటును కానీ ఉపయోగించలేదు.ఈ ఆలయ నిర్మాణం మొత్తం పూర్తిగా గ్రానైట్ తో నిర్మించబడింది.

 Interesting Facts About Brihadeeswara Temple-తంజావూరు బృహదీశ్వరాలయంలో దాగిఉన్న రహస్యాలేమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక క్షేత్రంగా తంజావూరు బృహదీశ్వరాలయాన్ని చెప్పవచ్చు.

Telugu 1000 Years Temple, 13 Floors Temple, Brihadeeswara Temple, Devill Tanjan, Granite Temple, Lard Shiva, Mysteries, Nandi Statue, Secrets, Shiva Lingam, Thanjavur-Telugu Bhakthi

ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎత్తు సుమారు 3.7 మీటర్లు ఉంటుంది.అదేవిధంగా నందీశ్వరుని విగ్రహం కూడా 2.6 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ఈ ఆలయంలో ప్రతిష్టించిన గోపుర కలశం ఏకంగా 80 టన్నుల ఏకశిలతో నిర్మించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.

ఈ ఆలయంలో దాగి ఉన్న మరొక రహస్యం ఏమిటంటే మిట్టమధ్యాహ్నం ఈ ఆలయం నీడ మనకు ఎక్కడా కనిపించదు.ఈ ఆలయంలో భక్తులు మాట్లాడుకుంటే ఆ మాటలు మనకు మళ్లీ ప్రతిధ్వనించవు.

ఈ విధంగా ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు వింతలు దాగి ఉన్నాయి.అదే విధంగా దేశంలో మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందినది కూడా తంజావూరు బృహదీశ్వరాలయం అని చెప్పవచ్చు

#Thanjavur #Nandi Statue #Shiva Lingam #Secrets #Devill Tanjan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU