బాలకృష్ణ ముందు కొండంత లక్ష్యం.. అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలివే?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 Interesting Facts About Boyapati Srinu Balakrishna Akhanda Movie , Interesting F-TeluguStop.com

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న పెద్ద సినిమా అఖండ కావడం, సింహా, లెజెండ్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగగా బిజినెస్ కు తగిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.అఖండ మూవీ నైజాం హక్కులు 11 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapatisrinu, Pragya Jaiswal, Prerelese-Movie

సీడెడ్ ఏరియాలో ఈ సినిమా హక్కులు 11 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 5.85 కోట్ల రూపాయలు అమ్ముడయ్యాయి.అఖండ ఈస్ట్ హక్కులు 3.95 కోట్ల రూపాయలకు అమ్ముడవగా వెస్ట్ హక్కులు 3.44 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా గుంటూరు హక్కులు 5.40 కోట్ల రూపాయలకు అమ్ముడవగా కృష్ణా హక్కులు 3.85 కోట్ల రూపాయలకు, నెల్లూరు హక్కులు కోటీ 89 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 46.40 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

Telugu Akhanda, Balakrishna, Boyapatisrinu, Pragya Jaiswal, Prerelese-Movie

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 2.40 కోట్ల రూపాయలకు అమ్ముడవగా రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు 4.47 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.55 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుందని చెప్పవచ్చు.పాజిటివ్ టాక్ వస్తే అఖండ బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు.బోయపాటి శ్రీను ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube