బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు  

 • క్యాన్సర్ … ఈ పేరు వినగానే సగం ప్రాణం పోయినంత పనవుతుంది. క్యాన్సర్ లో చాలారకాలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్రీస్ట్ క్యాన్సర్, స్కీన్ క్యాన్సర్‌, ప్రొటెస్ట్‌ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్‌ మనిషి ప్రాణానికి ప్రమాదమై కూర్చుంటున్నాయి. ప్రతీ ఏటా వేలల్లో, లక్షల్లో మనుషులు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. ఇక బ్లడ్ క్యాన్సర్ తెచ్చే ముప్పు అంతాఇంతా కాదు. ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 • * బ్లడ్ క్యాన్సర్ రక్తకణాలను దెబ్బతీస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా బోన్ మ్యారోలో, తెల్లరక్తకణాలపై ఉంటుంది.

 • * బ్లడ్ క్యాన్సర్‌ లో లుకేమియా, లింఫోమా, మైలోమా అనే రకాలు ఉంటాయి.

 • * లుకేమియా రక్తంలో, బోన్ మ్యారో లో కనిపిస్తుంది.

 • * లింఫోమా క్యాన్సర్ లింఫాటిక్ సిస్టమ్ ను దెబ్బతీస్తుంది.

 • * మైలోమా ప్లాస్మా సెల్స్ మీద చెడు ప్రభావం చూపుతుంది.

 • * ఈ మూడు రకాల బ్లడ్ క్యాన్సర్స్ కి ట్రీట్‌మెంటు పద్ధతులు వేరుగా ఉంటాయి.

 • * చాలవరకు బ్లడ్ క్యాన్సర్‌ ని ముందే గుర్తించటం, వచ్చినవెంటనే గుర్తించటం కష్టం. అందుకే దీని నుంచి బ్రతికి బయటపడ్డ వారికంటే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ.

 • * బ్లడ్ క్యాన్సర్ పిల్లలకి కూడా రావొచ్చు.

 • * 14 ఏళ్ళ లోపే చినిపోతున్న పిల్లల్లో అత్యధిక శాతం బ్లడ్ క్యాన్సర్ బాధితులే.

 • * కెమికల్స్ వాడే పనిచేస్తున్న వారికి ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

 • * స్మోకింగ్ అలవాటు ఉన్నవారు బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ.

 • * బ్లడ్ క్యాన్సర్ ఆడవారి కంటే మగవాళ్ళలోనే ఎక్కువ కనబడుతుంది.