బింబిసార దర్శకుడు హీరోగా నటించిన సినిమా ఏదో మీకు తెలుసా?

మరో 48 గంటల్లో కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ మల్లిడి డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదల కానుంది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని సాధారణ ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు.

 Interesting Facts About Bimbisara Director Mallidi Vasisth Details, Bimbisara, M-TeluguStop.com

ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కొత్త దర్శకుడిని నమ్మి కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వగా ఈ దర్శకుడు ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

బింబిసార డైరెక్టర్ అసలు పేరు మల్లిడి వేణు కాగా ఈ డైరెక్టర్ ఒక సినిమాలో హీరోగా నటించారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో మల్లిడి వేణు హీరోగా నటించడం గమనార్హం.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.మల్లిడి వేణు తండ్రి పేరు మల్లిడి సత్యనారాయణ కాగా ఈయన ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కావడం గమనార్హం.

మల్లిడి వేణు బింబిసారకు ముందు కళ్యాణ్ రామ్ కు రెండు కథలు చెప్పగా కళ్యాణ్ రామ్ ఆ రెండు కథలను రిజెక్ట్ చేశారని సమాచారం.ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Telugu Bimbisara, Mallidi Venu, Ntr, Mallidi Vasisth, Nandamurikalyan-Movie

కళ్యాణ్ రామ్, బింబిసార చిత్రయూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే బింబిసార సినిమాకు పరవాలేదనిపించేలా బుకింగ్స్ ఉన్నాయి.ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిస్తే బింబిసార2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.జూనియర్ ఎన్టీఆర్ కూడా బింబిసార సక్సెస్ సాధించడానికి తన వంతు సహకారం అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube