బాలయ్య టాక్ షోలో ప్రశ్నలు ముందే లీకవుతాయా.. ముందే ప్లాన్ చేశారంటూ?

బాలయ్య అన్ స్టాపబుల్ షో ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అన్ స్టాపబుల్ షో చివరి ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం కానుంది.

 Interesting Facts About Balakrishna Unstoppble Show Details Here  , Balakrishna-TeluguStop.com

మహేష్, వంశీ పైడిపల్లి అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైనా ఈ ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఆలస్యంగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.అయితే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేలా కొన్ని ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే.

బాలయ్య ఆ ప్రశ్నలను షో జరుగుతున్న సమయంలోనే అడిగారని ముందుగానే ప్రిపేర్ చేయలేదని చాలామంది భావించారు.ఈ షో సక్సెస్ వెనుక ఉన్న బీవీఎస్ రవి మాట్లాడుతూ మోహన్ బాబు ఎపిసోడ్ సమయంలో ప్రశ్నలను ముందుగానే సిద్ధం చేశామని ఆ ప్రశ్నలను ముందుగానే బాలయ్యకు, మోహన్ బాబుకు ఇచ్చామని చెప్పారు.

బాలయ్య చెవిలో మైక్ ను సెట్ చేసి ప్రాంప్టింగ్ ఇచ్చామని బీవీఎస్ రవి వెల్లడించారు.

బాలకృష్ణ తన బాడీ లాంగ్వేజ్ తో షోను మరో లెవెల్ కు తీసుకెళ్లారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

అన్ స్టాపబుల్ షో ప్రేక్షకులను మెప్పించడానికి స్క్రిప్ట్ కారణమని బీవీఎస్ రవి చెప్పకనే చెప్పేశారు.అయితే అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఈ షో ద్వారా బాలకృష్ణ యువతను సైతం ఆకట్టుకున్నారు.ఈ షో తర్వాత బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

మరోవైపు బాలయ్య నటించిన అఖండను హిందీలో యూట్యూబ్ లో విడుదల చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.బాలయ్య నటించిన పలు సినిమాలు హిందీలో యూట్యూబ్ లో విడుదలై ఆకట్టుకున్నాయి.బాలయ్య కొత్త సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

Unknown Facts Behind Balakrishna Unstoppable Talk Show

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube