బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే?

Interesting Facts About Balakrishna Okka Magadu Movie

కొన్ని సినిమాలపై రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి.అయితే ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతుంటాయి.

 Interesting Facts About Balakrishna Okka Magadu Movie-TeluguStop.com

బాలకృష్ణ హీరోగా అనుష్క హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కి 2008 సంవత్సరంలో రిలీజైన ఒక్క మగాడు సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.

ఈ సినిమా కథ, కథనం భారతీయుడు సినిమాను పోలి ఉందనే కామెంట్లు సైతం వినిపించాయి.లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత సరైన హిట్ లేని బాలకృష్ణకు ఈ సినిమాతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరింది.

 Interesting Facts About Balakrishna Okka Magadu Movie-బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగల్చడం గమనార్హం.దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా మరో సక్సెస్ ను అందుకున్న వైవీఎస్ చౌదరి బాలయ్యతో సినిమాను తీయాలనే కోరికను ఒక్క మగాడు సినిమాతో నెరవేర్చుకున్నారు.

ఈ సినిమాలో నిషా కొఠారి, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించారు.మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.2008 సంవత్సరం జనవరి 10వ తేదీన ఒక్క మగాడు మూవీ రిలీజ్ కాగా ఈ సినిమాకు భారీస్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినా ఆ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు.ఈ సినిమాకు నిర్మాత కూడా వైవీఎస్ చౌదరి కాగా ఆయనకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

ఒక్క మగాడు సినిమా ఫ్లాప్ గా నిలిచినా అదే సమయంలో వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన కృష్ణ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు రావడంతో పాటు రవితేజ కెరీర్ లో హిట్ గా కృష్ణ నిలిచింది.

#Okka Magadu #Balakrishna #Anushka #Nisha Kothari #BalakrishnaOkka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube