బాలయ్య హిట్ సినిమాకు సెన్సార్ సభ్యులు హెచ్చరిక జారీ చేశారట.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కేరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో భైరవద్వీపం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

 Interesting Facts About Balakrishna Bhairavadweepam Movie Details Here ,  Balakr-TeluguStop.com

బాలయ్యకు జోడీగా రోజా ఈ సినిమాలో నటించగా 1994 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం.

జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నంది అవార్డు వచ్చింది.

ఈ సినిమాకు చిరంజీవి స్విచ్ ఆన్ చేయగా రజనీకాంత్ క్లాప్ కొట్టారు.1994 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్లపరంగా రికార్డులను క్రియేట్ చేసింది.ఈ సినిమాలోని నరుడ ఓ నరుడా పాట ఈతరం ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలను అందుకుంది.

అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో గుర్రాలకు బాణాలు తగిలే సన్నివేశాల గురించి చెబుతూ ఆ సన్నివేశాల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారని బోగట్టా.

అయితే వన్యప్రాణి సంరక్షణ సంఘం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే మాత్రం ఆ షాట్స్ ను తొలగించాల్సి ఉంటుందని భైరవద్వీపం మేకర్స్ కు సెన్సార్ సభ్యులు చెప్పారు.అయితే సినిమా రిలీజైన తర్వాత వాళ్ల నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.

ఈ సినిమాలో గుర్రాలు వేగంగా పరుగెత్తే సమయంలో అవి ఆగడానికి వైర్లు కాళ్లకు అడ్డంగా కట్టారు.ఇలా చెయ్యడం వల్ల గుర్రాల కాళ్లకు దెబ్బలు తగలడంతో పాటు గుర్రాలు నడవలేని స్థితి ఏర్పడింది.అయితే గుర్రాలకు ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్య చికిత్స అందేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.బాలయ్య కేరీర్ లో స్పెషల్ మూవీగా భైరవద్వీపం నిలవడం గమనార్హం.

Interesting Facts About Balakrishna Bhairavadweepam Movie Details Here , Balakrishna , Bhairavadwwepam Movie , Details Here , Interesting Facts , Audience , Nandi Award ,Rajinikanth , Chiranjeevi - Telugu Audience, Balakrishna, Bhairavadwwepam, Chiranjeevi, Nandi Award, Rajinikanth

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube