బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమా కథ ఇదే.. బాలకృష్ణ ఫ్యాన్స్ షాకయ్యేలా?

స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలు సాధారణంగా మాస్ కథాంశాలతో తెరకెక్కుతుంటాయి.అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఫన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కుతాయి.

 Interesting Facts About Balakrishna Anil Ravipudi Combo Movie Details Here , Anil Ravipudi, Balakrishna, Shocking Facts, Srileela, F3, Tollywood-TeluguStop.com

బాలయ్య అనిల్ కాంబోలో సినిమా అంటే ఎలా ఉండబోతుందో అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడిసినిమా కథను రివీల్ చేసేశారు.

ఎఫ్3 సినిమా విడుదలైన తర్వాత అనిల్ రావిపూడి బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ తండ్రీ కూతురు మధ్య నడిచే కథతో బాలయ్య సినిమాను తెరకెక్కించనున్నామని తెలిపారు.50 సంవత్సరాల వయస్సు ఉన్న తండ్రి పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో ఈ సినిమాలో బాలయ్య అలా ఉంటారని అనిల్ పేర్కొన్నారు.

 Interesting Facts About Balakrishna Anil Ravipudi Combo Movie Details Here , Anil Ravipudi, Balakrishna, Shocking Facts, Srileela, F3, Tollywood-బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమా కథ ఇదే.. బాలకృష్ణ ఫ్యాన్స్ షాకయ్యేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.బాలయ్య పాత్ర మీదే ఈ సినిమా మొత్తం నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.హీరో పాత్ర చుట్టూ తిరిగే టెంప్లేట్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు.ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించని కోణంలో తాను బాలయ్యను చూపిస్తానని ఆయన అన్నారు.

బాలయ్యను అలా చూపించడం తనకు థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని అనిల్ చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులు తన నుంచి ఆశించే కామెడీ బాలయ్య సినిమాలో ఉండదని ఒక విధంగా ఇది ప్రయోగమని ఆయన తెలిపారు.బాలయ్య నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉండటంతో పాటు నేను అనుకునే కోణం కూడా ఉంటుందని అనిల్ రావిపూడి వెల్లడించారు.అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిల్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube