బాలయ్యకు సాధ్యమైంది ఎన్టీఆర్, చరణ్ లకు సాధ్యం కాలేదా.. ఏమైందంటే?

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై 100 రోజులైంది.ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో ప్రశంసలను అందుకుంది.

 Interesting Facts About Balakrishna Akhanda And Ntr Charan Rrr Movies Details He-TeluguStop.com

గత కొన్నేళ్లుగా తారక్, చరణ్ కోరుకుంటున్న పాన్ ఇండియా హీరో ఇమేజ్ ఈ సినిమాతో ఈ ఇద్దరు హీరోలకు సొంతమైంది.హాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.

అయితే ఒక్క విషయంలో మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.గతేడాది విడుదలైన అఖండ సినిమా 4 కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించబడింది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా 50 రోజుల కేంద్రాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఈ సినిమా ఒక్క థియేటర్ లో కూడా 100 రోజుల పాటు ప్రదర్శించబడలేదు.ఆర్ఆర్ఆర్ థియేటర్లలో 100 రోజుల పాటు ఆడకపోవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైన తర్వాత కేజీఎఫ్2, సర్కారు వారి పాట, ఆచార్య, ఎఫ్3 లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలో వరుసగా విడుదల కావడంతో ఆర్ఆర్ఆర్ థియేటర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో 40 రోజుల క్రితమే ఈ సినిమా అందుబాటులోకి రావడంతో థియేటర్ల ఓనర్లు ఈ సినిమాను ఎక్కువరోజుల పాటు ప్రదర్శించటానికి ఆసక్తి చూపలేదు.

Telugu Akhanda, Balakrishna, Rajamouli, Ram Charan, Tollywood-Movie

ఆర్ఆర్ఆర్ మూవీ కనీసం ఒక్క కేంద్రంలో అయినా 100 రోజుల పాటు ప్రదర్శించబడి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.మహేష్ సినిమాను మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని స్టార్ డైరెక్టర్ రాజమౌళి భావిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube