బాహుబలి సినిమా కథ అలా పుట్టిందా.. అభిమానులకు తెలియని షాకింగ్ విషయాలివే!

ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో బాహుబలి, బాహుబలి2 ముందువరసలో ఉంటాయి.ఈ సినిమాలు సాధించిన ఎన్నో రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Bahubali Movie Story Details, Bahubali, Vijayendra Prasa-TeluguStop.com

బాహుబలి సిరీస్ సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథారచయిత కాగా తాజాగా ఒక సందర్భంలో ప్రభాస్ అభిమానులకు, సాధారణ అభిమానులకు బాహుబలి సిరీస్ గురించి తెలియని ఎన్నో విషయాలను విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

బాహుబలి సినిమా కథ ఏ విధంగా పుట్టిందో ఆయన చెప్పుకొచ్చారు.

రాజమౌళి తనతో యాక్షన్ తో, బలమైన పాత్రలతో ఉన్న భారీ మూవీ కావాలని కోరారని బాహుబలి ది బిగినింగ్ సినిమాలో సత్యరాజ్ సుదీప్ పాత్రల మధ్య వచ్చే సీన్ ద్వారా ఈ సినిమా కథ మొదలైందని ఆయన వెల్లడించారు.జక్కన్నకు బాహుబలి గురించి చెప్పే సమయంలో ఆ సీన్ నే మొదట చెప్పానని ఆయన పేర్కొన్నారు.

బాహుబలి సినిమాకు సంబంధించి మొదట అనుకున్న లైన్ లో కొన్ని మార్పులు చేశామని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Telugu Anushka, Bahubali, Bahubali Story, Rajamouli, Prabhas, Ramya Krishna, Sat

80 ఏళ్ల వృద్ధుడు పిల్లలకు కత్తియుద్ధం నేర్పిస్తుంటాడని విదేశాల నుంచి వచ్చిన వ్యాపారి వృద్ధుడు చేస్తున్న కత్తి యుద్ధాన్ని చూసి మీరు గొప్ప యోధుడిలా ఉన్నారని చెప్పగా ఆ సమయంలో వృద్ధుడు బాహుబలి గురించి తెలుసా అని చెబుతాడని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Telugu Anushka, Bahubali, Bahubali Story, Rajamouli, Prabhas, Ramya Krishna, Sat

ఆ వీరుడు వెన్నుపోటుకు బలయ్యాడని నేనే చంపానని వృద్ధుడు చెబుతాడని ఆ తర్వాత తాను రాజమౌళికి శివగామి బిడ్డను కాపాడే సీన్ గురించి చెప్పానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.ఆ విధంగా బాహుబలి కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.విజయేంద్ర ప్రసాద్ బాహుబలి కథ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రభాస్, రాజమౌళి కెరీర్ లో బాహుబలి ప్రత్యేక సినిమాగా నిలిచిందనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube