అమలాపాల్ తల్లిదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తెలుగులో చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోని అమలాపాల్ తమిళంలో మాత్రం బాగానే ఆఫర్లు పొందుతున్నారు.సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.కేరళలో జన్మించిన అమలాపాల్ కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి ఆ ఇండస్ట్రీల్లో కూడా నటిగా మంచిపేరును సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Actress Amala Paul Mother And Father, Amala Paul, Custom-TeluguStop.com

2009 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన అమలాపాల్ కు నటించిన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.మొదట ఒక మలయాళ సినిమాలో నటించిన అమలా పాల్ అభినయానికి ప్రాధాన్యత ఉండే పాత్రలకు ఎక్కువగా ఓకే చెప్పారు.తెలుగులో అమలాపాల్ నటించిన సినిమాల్లో నాయక్ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు.ప్రముఖ దర్శకుడు ఎ ఎల్ విజయ్ కు విడాకులు ఇవ్వడం ద్వారా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.

2014 సంవత్సరంలో అమలాపాల్ ఎ ఎల్ విజయ్ వివాహం జరగగా మూడు సంవత్సరాలకే వాళ్లు విడిపోవడం గమనార్హం.

Telugu Amala Paul, Amalapaul, Customs, Paul, Mollywood, Mother-Movie

దర్శకుడు విజయ్ ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నా అమలాపాల్ మాత్రం మరో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.అమలాపాల్ తండ్రి పేరు పాల్ కాగా ఆయన కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి కావడం గమనార్హం.అమలాపాల్ తల్లి అన్నీస్ గాయనిగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు స్టేజ్ లపై పాడకపోయినా మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

Telugu Amala Paul, Amalapaul, Customs, Paul, Mollywood, Mother-Movie

అన్న అభిజిత్ సపోర్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ తక్కువ సమయంలోనే మంచి నటిగా ఎదిగారు.సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అమల నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు.తల్లిదండ్రులు మొదట సినిమాల్లోకి వెళ్లవద్దని చెప్పినా అన్న ప్రోత్సాహంతో అమలాపాల్ వాళ్లను ఒప్పించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube