నటి ప్రత్యూష లైఫ్ లోని చీకటి కోణాలు మీకు తెలుసా..?

నటిగా చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యూష చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి హృదయాల్లో మంచి నటిగా ముద్ర వేసుకున్నారు.నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించిన ప్రత్యూష 17 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

 Interesting Facts About Actress Pratyusha Life-TeluguStop.com

బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ప్రత్యూష ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డులను సొంతం చేసుకున్నారు.తెలుగుతో పోలిస్తే తమిళంలో ప్రత్యూష ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించారు.

ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి.రవితేజ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఒకటనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Actress Pratyusha Life-నటి ప్రత్యూష లైఫ్ లోని చీకటి కోణాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ మొదట పవన్ కళ్యాణ్, ప్రత్యూషలను సంప్రదించారు.అయితే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని పవన్ కళ్యాణ్, ప్రత్యూష ఇద్దరూ వదులుకోవడంతో రవితేజ, తనూరాయ్ ఆ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

ఒకవేళ ఈ సినిమాలో నటించి ఉంటే ప్రత్యూష స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఉండేవారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ప్రత్యూష మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి.

ప్రత్యూష తల్లి చాలా సందర్భాల్లో తన కుమార్తెది ఆత్మహత్య కాదని హత్య అని చెప్పుకొచ్చారు.ప్రత్యూష సిద్దార్థ్ అనే యువకుడిని ప్రేమించి పెద్దలు ప్రేమకు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు.

Telugu Interesting Facts, Life Secrets, Pratyusha, Pratyusha Brother-Movie

సిద్దార్థ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా ప్రత్యుష మాత్రం చనిపోయారు.విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రత్యుష మృతి ఇప్పటికీ మిస్టరీ అనే చెప్పాలి.భవిష్యత్తులోనైనా ఆమె మరణానికి సంబంధించిన అసలు కారణాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాల్సి ఉంది.ప్రత్యూష భౌతికంగా దూరమైనా సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ జీవించి ఉన్నారు.

ప్రత్యూష సోదరుడు సినిమాల్లో హీరో పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

#Pratyusha #Secrets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు