నమిత గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా నటిగా నమిత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నేడు నమిత పుట్టినరోజనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Actress Namitha-TeluguStop.com

గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన నమితకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉండేది.సినిమాలపై ఉండే ఆసక్తి వల్ల మోడలింగ్ తో నమిత కెరీర్ ను మొదలుపెట్టారు.

ఆ తరువాత సొంతం మూవీతో టాలీవుడ్ కు పరిచయమే తొలి సినిమాతోనే నమిత సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Actress Namitha-నమిత గురించి ఈ విషయాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కోలీవుడ్ ఇండస్ట్రీలో నమిత ఎక్కువగా గుర్తింపును సంపాదించుకున్నారు.

తమిళనాడులో నమితకు గుడి కట్టారంటే అక్కడి ఫ్యాన్స్ కు నమిత అంటే ఎంత అభిమానమో అర్థమవుతుంది.సొంతం సినిమా తరువాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జెమిని సినిమాలో నటించి నటిగా నమిత సత్తా చాటారు.

కెరీర్ తొలినాళ్లలో సన్నగా కనిపించిన నమిత తర్వాత కాలంలో లావుగా మారిపోయారు.నమితకు లావు కావడం వల్లే సినిమా ఆఫర్లు తగ్గాయని వార్తలు వినిపించాయి.

Telugu Bjp Party, Interesting Facts, Namitha, Tamil Heroine-Movie

కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న నమిత బిల్లా సినిమాతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.బిల్లా సినిమా సక్సెస్ కావడంతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం నమిత బిజీ అయ్యారు.తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతంలో నమిత కోసం అభిమానులు కట్టిన గుడి ఉంది.2017 సంవత్సరంలో నమిత వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.తమిళంలో ఖుష్బూ తరువాత నమిత ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు.

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఆఫర్లు తగ్గుతాయనే సంగతి తెలిసిందే.నమిత మాత్రం పెళ్లి తరువాత కూడా సినిమా ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం.మరోవైపు రాజకీయాలపరంగా బీజేపీకి ఆమె మద్దతు ప్రకటించి 2019 నుంచి ఆ పార్టీలోనే నమిత కొనసాగుతున్నారు.

ప్రస్తుతం భౌవౌ సినిమాలో నమిత హీరోయిన్ గా నటిస్తున్నారు.

#Tamil Heroine #Namitha #Bjp Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు