యావదాస్తిని గుళ్లకు, స్వచ్చంద సంస్థలకు ఇచ్చిన ఈ నటి గురించి మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలామంది స్వార్థపరులుగా మారిపోతున్నారు.కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు.

 Interesting Facts About  Actress  Kanchana Details Here Goes Viral , Arjun Reddy-TeluguStop.com

ప్రజల్లో మానవత్వం చచ్చిపోతుందని ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు ఘటనల ద్వారా ప్రూవ్ అయింది.కొంతమంది దానం చేసినా తమ సంపాదనలో చాలా తక్కువ మొత్తం మాత్రమే దానం చేయడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

అయితే ఒక నటి మాత్రం తన ఆస్తినంతా గుళ్లకు, స్వచ్చంద సంస్థలకు ఇచ్చేసింది.స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపును సొంతం చేసుకున్న కాంచనకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రకాశం జిల్లాకు చెందిన కాంచన అసలు పేరు వసుంధరా దేవి.ఆమె సంపన్న కుటుంబంలో జన్మించారు.ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కాంచన ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చారు.

ప్రేమించు చూడు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కాంచన వీరాభిమన్యు, ఆత్మగౌరవం, అవే కళ్లు సినిమాలతో నటిగా ప్రశంసలు అందుకున్నారు.

ఈరోజు ఆమె పుట్టినరోజు కావడం గమనార్హం.సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలలో, జానపద చిత్రాలలో నటించి కాంచన ప్రశంసలు పొందారు.తెలుగు, హిందీతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సైతం కాంచన నటించారు.

Telugu Arjun Reddy, Kanchana-Movie

ఆస్తిని మొత్తం విరాళంగా ఇచ్చిన కాంచనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.కొన్నేళ్ల క్రితం విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి సినిమాలో కాంచన కీలక పాత్రలో నటించి మెప్పించారు.తన నటనతో కాంచన ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

కాంచన ఆరోగ్యంగా జీవనం సాగించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ఈ జనరేషన్ లో కూడా కాంచనను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube