కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదేనా..?

సాధారణంగా సినిమాల్లో మేల్ కమెడియన్స్ తో పోలిస్తే ఫిమేల్ కమెడియన్స్ సంఖ్య తక్కువనే సంగతి తెలిసిందే.అయితే తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో కామెడీ రోల్స్ లో నటించి కోవై సరళ గుర్తింపును సంపాదించుకున్నారు.

 Interesting Facts About About Lady Comedian Kovai Sarala-TeluguStop.com

నటిగా కోవై సరళ 700కు పైగా సినిమాల్లో నటించడం గమనార్హం.మలయాళీ కుటుంబంలో జన్మించిన కోవై సరళ వయస్సు 58 సంవత్సరాలు.

తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే కోవై సరళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.వెల్లి రథం అనే సినిమాతో బాల నటిగా కోవై సరళ కెరీర్ ను మొదలుపెట్టారు.

 Interesting Facts About About Lady Comedian Kovai Sarala-కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలతో పాటు కోవై సరళ తమిళంలో కొన్ని టెలివిజన్ కార్యక్రమాలలో కూడా కనిపించారు.నేడు కోవై సరళ పుట్టినరోజు కాగా ప్రస్తుతం కోవై సరళ పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే కోవై సరళ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

Telugu 58 Years, Interesting Facts, Kovai Sarala, Lady Comedian-Movie

లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ కామెడీ సినిమాలలో కోవై సరళ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు.కామెడీ పండించడంలో కోవై సరళ శైలి మిగతా కమెడియన్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.2003 సంవత్సరంలో విడుదలైన ఓరి నీ ప్రేమ బంగారం కానూ సినిమాలో కోవై సరళ నటనకు ఆమెకు నంది అవార్డు వచ్చింది.కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని సమాచారం.

కోవై సరళకు నలుగురు చెల్లెళ్లు కాగా వారిని ఉన్నత విద్యలు చదివించడానికి, పెళ్లిళ్లు చేయడానికి కోవై సరళ పెళ్లి చేసుకోలేదని సమాచారం.

వివాహంపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో కోవై సరళ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.కోవై సరళ కామెడీ పండించిన వీడియోలకు యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

కోవై సరళ తరువాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ లేరనే చెప్పాలి.

#Lady Comedian #Kovai Sarala #58 Years

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు