ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పిన అఖిల్‌.. మోనాల్ దిమ్మ‌తిరిగే రియాక్ష‌న్‌?  

interesting discussion between akhil and monal! interesting discussion, akhil, monal, latest news, tollywood, bigg boss 4, bigg boss telugu, - Telugu Akhil, Bigg Boss 4, Bigg Boss Telugu, Interesting Discussion, Latest News, Monal, Tollywood

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎనిమిదో వారం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ వారం నామినేష‌న్స్‌లో లేని నోయ‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో అనూహ్యంగా ఇంటిని వీడాడు.

TeluguStop.com - Interesting Discussion Between Akhil And Monal

ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, అఖిల్‌, మోనాల్‌, మెహ‌బూబ్‌, లాస్య‌లో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.ఇక ఈ వారం కెప్టెన్‌గా అరియానా గెల‌వ‌గా.

తన కెప్టెన్ పవర్‌తో రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ని ఎంపిక‌ చేసింది.

TeluguStop.com - ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పిన అఖిల్‌.. మోనాల్ దిమ్మ‌తిరిగే రియాక్ష‌న్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మ‌రోవైపు గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తోన్న అభిజిత్‌-మోనాల్-అఖిల్‌‌లు మళ్లీ కలిసి ప్రేక్ష‌కులును ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు.

ఇదిలా ఉంటే.స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అఖిల్ తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో.

మోనాల్‌తో చెప్పుకొచ్చాడు.అన్‌సీన్ వీడియోలో ఎప్ప‌టిలాగే అఖిల్‌, మోనాల్ ఇద్ద‌రూ ఏకాంతంగా ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే మోనాల్ నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అని ప్ర‌శ్నించింది.

దీనికి స‌మాధానంగా అఖిల్‌.

ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కావాలి.పొట్టిగా ఉన్నా ప‌ర్వాలేదు.

న‌న్ను ప‌ట్టించుకోకున్నా ప‌ర్వాలేదు, కానీ మా అమ్మానాన్న‌ను మాత్రం బాగా చూసుకోవాలి.జెన్యూన్ ఉండాలి.

నన్నెవ‌రేమైనా అంటే త‌ను స్టాండ్ తీసుకోవాలి అని త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను మోనాల్ ముందు బ‌య‌ట పెట్టాడు.అనంత‌రం.

అలాంటి అమ్మాయి దొరుకుతుందా అని మోనాల్‌ను అఖిల్ ప్ర‌శ్నించారు.ఖ‌చ్చితంగా దొరుకుతుంద‌ని చెప్పుకొచ్చింది.

అయితే అక్క‌డితో ఆగని అఖిల్‌.షోలోనా? లేక షో అయిపోయాక దొరుకుతుందా అని మోనాల్‌ను ప్ర‌శ్నించ‌గా.షో అయిన త‌ర్వాతే నీ కోసం గేట్ ద‌గ్గ‌ర వెల్‌క‌మ్ చెబుతుంద‌ని న‌వ్వుకుంటూ చెప్పుకొచ్చింది.అయిన‌ప్ప‌టికీ అఖిల్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఆప‌లేదు.ఆమె నాకు తెలిసిన అమ్మాయేనా? అని అఖిల్ అడ‌గ్గా.అందుకు మోనాల్ ప‌రిచ‌యం లేని అమ్మాయని తెలిపింది.

దీంతో అఖిల్ ప‌రిచ‌యం లేని అమ్మాయి నాకొద్దంటూ చెప్పుకొచ్చాడు.మొత్తానికి వీరి డిస్క‌‌ష‌న్ ప్రేక్ష‌కుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేశాయి.

#Monal #Akhil #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Interesting Discussion Between Akhil And Monal Related Telugu News,Photos/Pics,Images..