నాగ్ తో లిప్ లాక్ సీన్ చేస్తున్న అమలాపాల్.. ఆ షరతులతో?

Interesting Details About Amala Paul And Nagarjuna Romance In Ghost

స్టార్ హీరో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

 Interesting Details About Amala Paul And Nagarjuna Romance In Ghost-TeluguStop.com

గరుడవేగ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ మూవీతో ఆ సినిమాను మించిన సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన ది ఘోస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు.కాజల్ కొన్నిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు.

 Interesting Details About Amala Paul And Nagarjuna Romance In Ghost-నాగ్ తో లిప్ లాక్ సీన్ చేస్తున్న అమలాపాల్.. ఆ షరతులతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాజల్ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలామంది పేర్లను పరిశీలించి చివరకు ఆమెకు బదులుగా అమలాపాల్ ను ఎంపిక చేశారని సమాచారం.ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.ఈ సీన్లలో లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని సమాచారం.అయితే కొన్ని షరతులతో లిప్ లాక్ సీన్ చేయడానికి అమలాపాల్ అంగీకరించారని సమాచారం.లిప్ లాక్ సీన్స్ లో నటించాలంటే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని అమలా పాల్ కోరినట్టు తెలుస్తోంది.

అయితే కాజల్ ఈ మూవీలో నటించి ఉంటే రొమాంటిక్ సీన్లలో నటించేవారా? కాదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.అమలాపాల్ ఇప్పటికే పలు సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో నటించి విజయాలను అందుకున్నారు.ఆమె సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అమలాపాల్ నగ్నంగా నటించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు.

#AmalaPaul #Amala Paul #Details #Nagarjuna #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube