నన్ను సర్ అని పిలవద్దు అంటూ పవన్ కి రిక్వస్ట్ చేసిన కేటీఆర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తన కంటే చిన్నవాళ్ళు అయిన కూడా సర్ అని సంబోధిస్తూ మాట్లాడటం అలవాటు.ఇండస్ట్రీలో కూడా తనతో నటించే చిన్న నటులని కూడా సర్ అని సంబోధిస్తూ ఉంటారు.

 Interesting Conversation Between Pawan Kalyan And Ktr, Tollywood, Telangana, Ktr-TeluguStop.com

అలాంటి అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశించి సర్ అని సంబోధించారు.దానికి కేటీఆర్ ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు.

ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీరు చేస్తున్న కృషి అమోఘం, ఈ సందర్భంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం కేటీఆర్ సర్ అంటూ పవన్ కల్యాణ్ అభినందనపూర్వకంగా ట్వీట్ చేశారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తనను అభినందించినందుకు థ్యాంక్స్ అన్నా అంటూ పవన్ కు వినమ్రంగా బదులిచ్చారు.అయితే సర్ అని పిలుస్తున్నారు ఇదెప్పటినుంచి.దయచేసి నన్నెప్పుడూ బ్రదర్ అనే పిలవండి చాలు అంటూ ట్వీట్ చేశారు.దీనికి పవన్ కల్యాణ్ వెంటనే బదులిస్తూ, అలాగే బ్రదర్ అని పేర్కొన్నారు.

ఇలా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కేటీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.రాజకీయంగా వారి మధ్య ఎన్ని అయిన ఉండొచ్చు కాని ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మాత్రం ఎప్పటికి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube