గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Interesting Buzz On Salman Khan Role In Chiranjeevi Godfather Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఇటీవలే ఊటీ లో సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది

Telugu Acharya, Bhola Shankar, God Godfather Latest Update, Godfather, Interesting Buzz On Salman Khan Role In Chiranjeevi Godfather Movie, Megastar Chiranjeevi, Salman Khan-Movie

చిరంజీవి కోరిక మేరకు ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు.ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

 Interesting Buzz On Salman Khan Role In Chiranjeevi Godfather Movie-గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈయన పాత్రపై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వైరల్ అవుతుంది.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర కొద్దిగానే ఉంటుందని ముందుగా తెలిసింది.కానీ ఈయన పాత్ర అనుకున్న దాని కన్నా ఎక్కువ నిడివే ఉంటుందని తాజా సమాచారం.అంతేకాదు సల్మాన్ ఖాన్ పై ఒక సాంగ్ కూడా ఉండనుందని సమాచారం.

మరి ఇంకా షూటింగ్ జరిగే కొద్దీ ఇంకెన్ని సంగతులు బయటకు వస్తాయో వేచి చూడాలి.

Telugu Acharya, Bhola Shankar, God Godfather Latest Update, Godfather, Interesting Buzz On Salman Khan Role In Chiranjeevi Godfather Movie, Megastar Chiranjeevi, Salman Khan-Movie

ఇక చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ‘ఆచార్య‘ సినిమాలో నటించాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా కూడా ప్రకటించాడు.

గాడ్ ఫాదర్ పూర్తి అవ్వగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

#Salman Khan #Bhola Shankar #God Godfather #Chiranjeevi #Godfather

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు