'వీరమల్లు' కోసం రెడీ అవుతున్న పవన్!

Interesting Buzz On Pawan Kalyan Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మరొకసారి వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాడు.ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపు తున్నాడు.

 Interesting Buzz On Pawan Kalyan Hari Hara Veera Mallu-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 Interesting Buzz On Pawan Kalyan Hari Hara Veera Mallu-వీరమల్లు’ కోసం రెడీ అవుతున్న పవన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొగల్ చక్రవర్తి పాలనా కాలానికి సంబంధించిన కథ ఇది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ తోనే మంచి మార్కులు కొట్టేసారు.ఇది మొగల్ చక్రవర్తుల కాలం నాటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం భారీ సెటింగ్స్ వేసి మరి తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.

ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపైనే ద్రుష్టి పెట్టాడు.

Telugu Arjun Rampaul, Bheemla Nayak, Harihara, Buzzpawan, Nidhi Agrawal, Pawan Kalyan-Movie

ఈ సినిమా పూర్తి అయినా తర్వాత వీరమల్లు సినిమాను స్టార్ట్ చెయ్యాలని పవన్ భావించి ఈ సినిమా షూటింగ్ ను చివరి దశకు తీసుకు వచ్చాడు.ఇక ఇప్పుడు పవన్ వీరమల్లు సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.ఈ నెల 25 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్.

Telugu Arjun Rampaul, Bheemla Nayak, Harihara, Buzzpawan, Nidhi Agrawal, Pawan Kalyan-Movie

ఇక ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు క్రిష్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో అర్జున్ రామ్ పాల్, జాక్వెలిన్ ఫెర్నాడస్ కూడా పాల్గొన బోతున్నట్టు సమాచారం.ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచేలా క్రిష్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇందులో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాను క్రిష్ వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తాం అని ఎప్పుడో ప్రకటించాడు.

#HariHara #Nidhi Agrawal #Arjun Rampaul #Pawan Kalyan #BuzzPawan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube