క్రేజీ రూమర్.. తారక్ తో కమల్ హాసన్.. ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Interesting Buzz On Ntr31, Ntr, Prashanth Neel, #ntr31, Ntr Prasanth Neel, Korat-TeluguStop.com

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి నటుడుగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కించింది.

Telugu Buzz Ntr, Kamal Haasan, Koratala Shiva, Ntr, Prashanth Neel-Movie

మరి ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ తర్వాత చేయబోతున్న NTR31 మీదనే ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఎన్టీఆర్ 31వ సినిమా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు కాబట్టి.అందుకే ఈ సినిమాపై మరింత ద్రుష్టి పెడుతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరొక కీలక పాత్ర కూడా ఉండబోతుందట.

ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనుందట.అందుకే ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ విశ్వ నటుడు కమల్ హాసన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ఆయనను ఈ పాత్ర కోసం ఎలాగైనా ఒప్పించి తీరాలని నీల్ భారీ స్కెచ్ వేసినట్టు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.మరి ఈ రూమర్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే నిజం అయ్యి కమల్ కనుక ఈ పాత్ర కోసం ఒప్పుకుంటే ఇక ఈ సినిమా మరో లెవల్ కు చేరుకోవడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube