బిగ్ బాస్ 5 తెలుగు ట్రాన్స్ జెండర్ గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్స్ ఇవే!

Interesting And Unknown Facts About Bigg Boss 5 Telugu Transgender Priyanka Singh

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా కమెడియన్ గా అందరికీ పరిచయమైనసాయి తేజ్ స్టేజ్ పై ఎంతో మందిని నవ్వించినా, తన జీవితంలో మాత్రం ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.సమాజానికి తాను ఒక అబ్బాయిగా తెలిసినప్పటికీ చిన్నప్పటినుంచి తనలో అమ్మాయి లక్షణాలు, కోరికలు ఎక్కువగా ఉన్నాయని ఈ క్రమంలోనే చిన్నప్పటినుంచి తన అక్క బట్టలు ధరించడం ఎవరికీ తెలియకుండా చీరలు కట్టుకోవడం వంటి పనులు చేసేవాడిని ఓ సందర్భంలో సాయి తేజ్ ఉరఫ్ ప్రియాంక సింగ్ తెలియజేశారు.

 Interesting And Unknown Facts About Bigg Boss 5 Telugu Transgender Priyanka Singh-TeluguStop.com

తనలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల తాను ఇప్పుడు కాకుండా మరి కొంత ఆలస్యంగా అమ్మాయిగా మారిన ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి తను ట్రాన్స్ జెండర్ గా మారుతున్నటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పకుండా తన స్నేహితుల సహాయంతో సర్జరీ చేయించుకుందని తెలిపారు.అయితే సర్జరీకి ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు అయ్యాయని అప్పటివరకు జబర్దస్త్ ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం తన సర్జరీ కోసం ఉపయోగించానని ప్రియాంక సింగ్ తెలియజేసింది.

 Interesting And Unknown Facts About Bigg Boss 5 Telugu Transgender Priyanka Singh-బిగ్ బాస్ 5 తెలుగు ట్రాన్స్ జెండర్ గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్స్ ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాను సర్జరీ చేయించుకున్న తర్వాత తొమ్మిది నెలల పాటు ఎంతో నరకాన్ని చూశానని అయితే తాను సర్జరీ ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్టు తెలిపారు.ఇలా అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ ప్రస్తుతం తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.తనకు గ్లామరస్ పాత్రలో నటించే అవకాశాలు వచ్చినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ తనదైన శైలిలో ఆడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

#Secrets #Nagarjuna #Biggboss #Jabardsth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube