మిడతలు అంత డేంజర్ అంట! మీకు తెలుసా?

2020 సంవత్సరం ప్రారంభం, ప్రపంచ నాశనం ప్రారంభం అయ్యింది.గత ఐదు నెలలుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.

 Interesting And Shocking Facts About Deadly Locusts, Locusts-TeluguStop.com

అలాంటి ఈ కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతుందని అనుకున్న సమయంలో పొలం నాశనం అవ్వడం ప్రారంభమైంది.నిజానికి కరోనా వైరస్ వచ్చి అన్ని రంగాలు చాలా వరకు నాశనమైనప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం కొద్దొ, గొప్పో బాగుంది.

కానీ ఇప్పుడు భారత్ లోని పంటపొలాలపై మిడ‌త‌లు దండెత్తాయి.మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మిడ‌తలు ఇప్పుడు రైతుల పాలిట రాక్ష‌సులుగా మారాయి.పంట ఏదైనా పచ్చగా ఉంది అంటే చాలు తినేస్తున్నాయి.ఒక్కసారే లక్షల మిడతలు పంటపై దాడి చేశాయి.

దీంతో 35 వేలమందికి సరిపడే ఆహారాన్ని ఒక్క రోజులో మిడతలు తినేశాయ్.గత 27 ఏళ్లలో ఇలాంటి దారుణం ఎప్పుడు జరగలేదట, అలాంటి ఈ మిడతల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

  • ఈ మిడతలు పంట ఏదైనా సరే పూర్తిగా తినేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి.
  • ఈ మిడతలు కేవలం మొక్కలను మాత్రం ఆరగిస్తాయి.
  • గుంపులుగా దండెత్తితే పైరు ఆనవాళ్లు కూడా కనిపించవు.
  • రోజులో 150 కి.మీ వరకు ప్రయాణిస్తాయట.
  • కిలో మీటర్ పరిధి గల ప్రాంతాన్ని 8 కోట్ల మిడతలు ఆక్రమించగలవాట.
  • 35 వేల మందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయట.
  • ఈ మిడతలు తూర్పు ఆఫ్రికా నుండి ప్రారంభమై ఇప్పుడు పాకిస్థాన్ నుండి మన దేశంలోకి వచ్చాయట.

  • ప్రపంచంలోనే ఇతర వలస కీటకాలతో పోలిస్తే మిడతల దండు అత్యంత ప్రమాదకరమైనదట.దీని వాళ్ళ తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుందట.
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube