సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్న సింగర్.. చివరకు..?

మనలో ప్రతి ఒక్కరూ కలలు కంటారు.ఆ కలలను నిజం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు.

 Interestinf Facts About Star Singer Mohana Bhogaraju-TeluguStop.com

అయితే కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకోవడంలో సఫలమవుతారు.అలా ప్రతిభతో సక్సెస్ సాధించిన సింగర్లలో మోహనా భోగరాజు ఒకరు.

సింగర్ గా గుర్తింపును సంపాదించుకోవాలని మోహనా భోగరాజు ఎన్నో ప్రయత్నాలు చేశారు.అయితే ఆ ప్రయత్నాలలో ఎక్కువ ప్రయత్నాలు ఫెయిల్ కావడం గమనార్హం.

 Interestinf Facts About Star Singer Mohana Bhogaraju-సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్న సింగర్.. చివరకు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటంతో నిరాశ పడకుండా మోహనా భోగరాజు మళ్లీ ప్రయత్నించారు.తన ప్రతిభతో టాలీవుడ్ లోని స్టార్ సింగర్లలో ఒకరిగా మోహనా భోగరాజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మోహనా భోగరాజు తాను ఏలూరులో పుట్టానని హైదరాబాద్ లో పెరిగానని చెప్పారు. బీటెక్ తర్వాత సింగర్ గా గుర్తింపును సొంతం చేసుకుని ఎంబీఏ చేశానని మోహనా భోగరాజ్ వెల్లడించారు.

Telugu Bahubali, Bullet Bandi, Interesting Facts, Maguva Song, Mohana Bhogaraju, Mohana Bhogaraju Details, Monohara Song, Private Single, Star Singer, Top Singer, Vakeel Saab-Movie

చిన్నప్పుడు మ్యూజిక్ క్లాసెస్ కు వెళ్లానని వేదికలపై పాడే సమయంలో ప్రశంసలు, బహుమతులు రావడంతో సినిమాల్లో ఒక్క పాట అయినా పాడాలని నిర్ణయం తీసుకున్నానని మోహనా భోగరాజు చెప్పుకొచ్చారు.బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ తన కెరీర్ ను మలుపు తిప్పిందని అరవింద సమేత, శతమానం భవతి, సోగ్గాడే చిన్నినాయన వకీల్ సాబ్ లో మగువా మగువా పాటకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె అన్నారు.

Telugu Bahubali, Bullet Bandi, Interesting Facts, Maguva Song, Mohana Bhogaraju, Mohana Bhogaraju Details, Monohara Song, Private Single, Star Singer, Top Singer, Vakeel Saab-Movie

తాను చేసిన బుల్లెట్ బండి అనే ప్రైవేట్ సింగిల్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కిందని మోహనా భోగరాజు చెప్పుకొచ్చారు.సోనే సోనే అనే పాటను పంజాబీలో పాడానని ఆమె చెప్పుకొచ్చారు.తన ప్రైవేట్ ఆల్బమ్స్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయని మోహనా భోగరాజు చెప్పుకొచ్చారు.స్టార్ సింగర్ గా గుర్తింపును సంపాదించుకున్న మోహనా భోగారాజుకు ఆఫర్లు అంతకంతకూ పెరగడం గమనార్హం.

#Monohara #MohanaBhogaraju #Bullet Bandi #Maguva #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు