ఉద్యోగులు,మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..?

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు ఉద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది.చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

 Interest Rates On Small Saving Schemes Unchanged,interest Rates,saving Schemes,u-TeluguStop.com

ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.

ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ పై 7.1 శాతం వడ్డీ లభించనుంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై 7.4 శాతం, పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లపై 5.5 నుండి 6.7% వడ్డీ పొందేందుకు అవకాశం ఉంటుంది.అంతేకాకుండా కిసాన్ వికాస్ పత్రం స్కీమ్ లో చేరితే 6.9% వడ్డీ లభించనుంది.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వడ్డీరేటు ప్రాతిపదికన చూస్తే… ఈ స్కీం లో చేరిన వారి డబ్బులు 124 నెలల్లో రెండింతలు కానున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఎంతగానో ప్రజాదరణ పొందిన పథకం సుకన్య సమృద్ధి యోజన లో చేరితే 7.6 శాతం వడ్డీ లభించనుంది.అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోల్చి చూస్తే ఈ పథకానికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube