వైరల్: మూడు అడుగుల ట్రాక్టర్ తయారు చేసి ఔరా అనిపిస్తున్న ఇంటర్ విద్యార్థి..!

ప్రతిభకు వయసుతో పని లేదని ఒక ఇంటర్ చదివే విద్యార్థి నిరూపించాడు.టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు.

 Inter Student Who Made A Three Foot Tractor   3 Feet, Trcakter, Viral Latest, V-TeluguStop.com

కాస్త మెదడుకు పదును బెట్టి చూడు అద్భుతాలు సృష్టించవచ్చని ఇంటర్ చదివే గుర్విందర్ అనే విద్యార్థి అందరికి తెలియచేసాడు.పంజాబ్​ కు చెందిన గుర్విందర్ అనే యువకుడు అతి చిన్న ట్రాక్టర్​ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కేవలం మూడు అంటే మూడు అడుగుల ట్రాక్టర్ ను తయారు చేసి అందరికి షాక్ ఇచ్చాడు.గురివిందర్ కు చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే ఎంతో ఆసక్తి.

ఆ ఆసక్తితోనే ఇప్పుడు ఒక అద్భుతమైన ట్రాక్టర్ ను తయారుచేసాడు.ఇంటర్ చదువుతున్న గుర్విందర్​ అనే విద్యార్థి ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.

చిన్నప్పటి నుండి ట్రాక్టర్ మీద ఉన్న ఆసక్తితో ఒక సరికొత్త ట్రాక్టర్ ను తయారు చేయాలని భావించాడు.అలా మూడు అడుగుల ఎత్తు ఉన్న ఒక ట్రాక్టర్‌ను తయారు చేశాడు.

ఈ ట్రాక్టర్ సాధారణ ట్రాక్టర్‌ లాగానే ఉంటుంది.అలా తయారుచేసిన బుడ్డి ట్రాక్టర్ ను రోడ్డు మీద నడిపి స్థానికుల అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇది ఒక్కటే కాకుండా చిన్న చిన్న మోటర్లను ఉపయోగించి ఇప్పటికే చాలా రకాల ట్రాక్టర్లను తయారు చేసినట్లు గుర్విందర్ తెలిపాడు.కరోనా లాక్​డౌన్​ సమయంలో 40 వేల రూపాయిలతో ఈ మినీ ట్రాక్టర్​ను తయారు చేసినట్టు గుర్విందర్ తెలిపాడు.

Telugu Feet, Trcakter, Latest-Latest News - Telugu

అలాగే తాను తయారుచేసిన ఈ ట్రాక్టర్​ లీటరుకు 35 కి.మీ మైలేజీ ఇస్తుందని, 4 క్వింటాళ్ల వరకు బరువును మోయగలదని గుర్విందర్ తెలిపాడు.తాను తయారుచేసిన ఈ మినీ ట్రాక్టర్‌ పై బయటకు వెళ్లినప్పుడు తనతో పాటుగా తన ట్రాక్టర్ ను కూడా చాలా మంది ఫొటోలు తీసుకుంటున్నారని చెప్పాడు.ఇక కుమారుడు సాధించిన ఈ ఘనత పట్ల గుర్విందర్ తండ్రి అయిన సాధు సింగ్ ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేసాడు కుమారుడు.

సాధించిన ఈ ట్రాక్టర్ వలన తమ రోజువారీ పని మరింత సులభతరం అయిందని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube