జూలై 1 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్ లైన్ క్లాసులు..!

తెలంగాణాలో ఈ నెల 16 నుండి అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుండి సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డ్ కు ఆదేశాలు ఇచ్చారు.

 Inter Second Year Online Classes Start From July 1st, Inter , Inter Board , Inte-TeluguStop.com

జూలై 5వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జరుగనున్నాయని తెలుస్తుంది.ఫస్ట్ ఇయర్ ప్రారంభించే క్రమంలో కళాశాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

జూలై 1 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ జలీల్ తెలిపారు.

దూరదర్శన్, టి శాట్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు ప్రసారం చేస్తారని తెలుస్తుంది.

గతేడాది సిలబస్ నుండే 70 శాతం పాఠాలు ఉంటాయని అన్నారు.ఒకవేళ టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్ధులు కళాశాలకు వచ్చి డిజిటల్ గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించినట్టు సమాచారం.

విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేలా ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తుంది.ఇంటర్ విద్యార్ధులను పరీక్షలు లేకుండానే పాస్ చేయించిన విషయం తెలిసిందే.

ఫస్ట్ ఇయర్ వారికి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ఇవ్వనున్నారు.సెకండ్ ఇయర్ ఆన్ లైన్ క్లాసులు మాత్రం జూలై 1 నుండి ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube