ఇంటర్ రిజల్ట్స్ ఒచ్చే .. గర్ల్స్ టాప్

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖామంత్రి ఘంటా శ్రీనివాస రావు విడుదల చేశారు.విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

 Inter Results Are Out And Girls Topping It-TeluguStop.com

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 28 రోజులలో మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఎం.వి.సత్యనారాయణ తెలిపారు.


ఇక రాబోయే సంవత్సరం నుండి కూడా రెండు సంవత్సరాల ఇంటర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయటం కొనసాగుతుందని తెలిపారు.ఏ,బీ,సీ,డీ గ్రేడ్ ల వారిగా విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 68.08 శాతంతో 3,18,300 విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.సెకండ్ ఇయర్ లో 73.78 శాతంతో 3,03,934 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.కాగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.

రెండు పరీక్షల ఫలితాల్లో కృష్ణా జిల్లా తొలిస్థానం దక్కించుకొని టాప్ గ నిలవగా ఫస్ట్ ఇయర్ లో అనంతపురం జిల్లా చివరి స్థానంలో సెకండ్ ఇయర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచాయి.మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube