కులాంతర వివాహాలు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే...  

Inter Caste Marriages In Tollywood-inter Caste Marriages,mahesh Babu,nagarjuna,pawan Kalyan,ram Charan,tollywood

మన దేశం లో పెళ్లి చేసుకోవాలంటే ఎక్కువ మంది ముందు అడిగేది కులం. ఒక్కపుడు మన రాష్ట్రం లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కులాంతర వివాహాలు చేయడానికి ఇష్టపడేవారు కాదు , అలా చేసుకుంటే ఇంట్లో నుండి బయటకు పంపించేవాళ్ళు . ఇప్పటికి కులాంతర వివాహాలు , ప్రేమ వ్యవహారాల పైన వార్తలు వస్తూనే ఉన్నాయి..

కులాంతర వివాహాలు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే...-Inter Caste Marriages In Tollywood

అయితే మన తెలుగు సినిమా లో ప్రముఖ నటులు కులాంతర వివాహాలు చేసుకొని కులం అనేది ఉట్టి మాటే అని నిరూపించారు. ఆ టాలీవుడ్ ప్రముఖులు ఎవరో చూద్దాం…

1. నాగార్జున – అమల

అమ్మాయిల కలల రాకుమారుడు , మన్మధుడు కింగ్ నాగార్జున , అక్కినేని నాగేశ్వర రావు గారి అబ్బాయిగా తెలుగు తెరకు పరిచయం అయి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. ఆయన రామనాయుడు గారు కూతురిని వివాహం ఆడి కొన్ని కారణాల వల్ల విడిపోయారు. 1989 లో కిరాయి దాదా అనే సినిమా షూట్ లో అమల తో ప్రేమలో పడ్డాడు. ఆమె బెంగాలీ అమ్మాయి అయితే వీరి ప్రేమను నాగేశ్వర్ రావు గారు ఒప్పుకొని అమల నాగ్ పెళ్లి చేయారు.

2. రామ్ చరణ్ – ఉపాసన

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయి రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ తేజ్ , తన చిన్ననాటి స్నేహితురాలు ఆయన ఉపాసన తో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ కాపు సామాజిక వర్గం కాగా ఉపాసన రెడ్డి సామాజిక వర్గం , వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకొని వీరిద్దరిని ఒకటి చేశారు.

3. మహేష్ బాబు – నమ్రత

టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు కి ఇప్పటికి అమ్మాయిల లో విపరీతమైన క్రేజ్ ఉంది , మహేష్ బాబు వంశీ అనే సినిమాలో నమ్రత తో నటిస్తుండగా ఆమెతో పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ పెళ్లికి కృష్ణ గారు మొదట్లో ఒప్పుకోలేదు కానీ కొన్నాళ్ళకి వీరి ప్రేమని అర్ధం చేసుకుని వీరిద్దరి వివాహం దగ్గరుండి జరిపించారు.

4. నాగ చైతన్య – సమంత

ఏ మాయ చేసావే సినిమాతో నాగ చైతన్య సరసన నటించిన సమంత తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. వీరిద్దరూ దాదాపు నాలుగు సినిమాలు కలిసి నటించారు.

వీరిద్దరూ ప్రేమకంచుకుంటున్న సంగతి నాగార్జున కి చెప్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నాగ చైతన్య కమ్మ సామాజిక వర్గం కాగా , సమంత క్రిస్టియన్ అమ్మాయి. పెళ్లి విషయం లో నాగ చైతన్య సమంత తమ మత ఆచారానికి తగ్గట్టు పెళ్లి చేసుకున్నారు.

5. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్ తో డాన్స్ లతో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి తో ప్రేమాయణం నడిపి ఇంట్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పాడట , స్నేహ వాళ్ళ ఫ్యామిలీ వారు అల్లు అరవింద్ గారికి తెలిసిన వాళ్ళు కావడం తో ఇరువర్గాల సమక్షం లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

6. మంచు వారి అబ్బాయిల కులాంతర వివాహాలు

మంచు మోహన్ బాబు ఈయన రూటే సేపరేటు, మోహన్ బాబు గారు ఎప్పుడు కులం గురించి మాట్లాడిన ఆయనకి కుల పిచ్చి లేదనే చెపుతారు. మాటల్లోనే కాదజే చేతల్లో కూడా చూపెట్టారు మోహన్ బాబు గారు.

ఆయన ఇద్దరి కుమారులు , కూతురి కి కులాంతర వివాహాలు చేసి ఆయనకి కులం అనేది ఉట్టి మాటే అని నిరూపించాడు. మంచు విష్ణు తన స్నేహితురాలు వేరొనికా ని పెళ్లి చేసుకోగా , మంచు మనోజ్ ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరే కాకుండా సుమంత్ – కీర్తి రెడ్డి , పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ , నాని – అంజనా ఇంకా కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు కులాంతర వివాహాలు చేసుకున్నారు.