కులాంతర వివాహం చేసుకుందని దారుణమైన శిక్ష  

కులాంతర వివాహం చేసుకున్న మహిళకి దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు. .

Inter-caste Marriage Women Facing Harassment-inter-caste Marriage Women,up

దేశంలో అంతరానితం, కుల వివక్షఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కుల వివక్ష అప్పుడప్పుడు పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది..

కులాంతర వివాహం చేసుకుందని దారుణమైన శిక్ష-Inter-caste Marriage Women Facing Harassment

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబువా జిల్లాలోని భోపాల్‌కు 340 కి.మీటర్ల దూరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేవిఘర్‌లో ఓ మహిళ ప్రేమించి వేరొక కులానికి చెందని వ్యక్తితో వివాహం చేసుకుంది.

అయితే దీనిపై ఆగ్రహించిన పెళ్ళికొడుకు కులానికి చెందిన వారు, ఆ మహిళపై వివక్షాపూరితంగా వ్యవహరించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని ఆమెకి శిక్ష విధించారు. దీనితో ఆమె చేసేది ఏమి లేక భర్తను మోసుకెళ్లింది.

నడవడానికి ఇబ్బంది పడుతున్నా వారు కనికరించకుండా డ్యాన్సులు చేస్తూ పైశాచిక ఆనందం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి కేసును నమోదు చేసారు.