ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం' సెన్సార్ పూర్తి, యూఏ సర్టిఫికెట్ తో విడుదలకు రెడీ

యువ హీరో తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం.ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు.

 Intense Action Thriller Movie Maro Prasthan Sensor Completed With Ua Certificate-TeluguStop.com

వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మరో ప్రస్థానం‘ కావడం విశేషం.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.‘మరో ప్రస్థానం’ చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది.వన్ షాట్ ఫిల్మ్ గా సెన్సార్ సభ్యుల ప్రశంసలు ‘మరో ప్రస్థానం’ చిత్రానికి దక్కాయి.‘మరో ప్రస్థానం’ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా.

దర్శకుడు జాని మాట్లాడుతూ.’మరో ప్రస్థానం’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.సినిమా చూసిన సెన్సార్ సభ్యులు వన్ షాట్ ఫిల్మ్ గా ‘మరో ప్రస్థానం’ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని అభినందించారు.సినిమా బాగుందంటూ వాళ్లు చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.‘మరో ప్రస్థానం’ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసేలా ఉంటుంది.సినిమా చూసే వాళ్లను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది.సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం.థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం.

అన్నారు.

Telugu Bhanusri Mehra, Johnny, Tanish, Muskaan Sethi, Maro Prasthan, Maro Prasth

రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి.పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ – కపిల్, ఫైట్స్ – శివ, దర్శకత్వం – జాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube