ఇంటిలిజెన్స్ సర్వే లీక్..జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...???

ఏపీలో ఎన్నికల సమరానికి పట్టుమని ఇంకా పదిరోజులు కూడా లేదు.ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.

 Intelligence Survey Leak On District Wise Parties Seats-TeluguStop.com

గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.అయితే ఇప్పటికే చాలా మంది వైసీపీ విజయం ఖాయం అంటూ లెక్కలు వేస్తున్నారు కూడా రిపబ్లికన్ సర్వే లో కాని కొన్ని జాతీయ మీడియా సంస్థల సర్వేలలో కానీ వైసీపీ కి ఏకంగా 20 నుంచీ 23 ఎంపీ స్థానాలు పక్కా వస్తాయని లెక్కలు కూడా వేసి చెప్పాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఇంటిలిజెన్స్ సర్వే రిపోర్ట్ బయటకి రావడంతో

ఏపీ ప్రజలు అందరూ ఈ సర్వే పై ఆసక్తి చూపిస్తున్నారు.ఏపీ ఇంటిలిజెన్స్ స్వయంగా ఏపీ ప్రజలకి ఫోన్లు చేసి వచ్చే ఎన్నికల్లో సీఎం గా ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అని అడుగగా దాదాపు అందరూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని సీఎం గా చూడాలని అనుకుంటున్నట్టుగా తెలిపారట.

ఇదే రిపోర్ట్ చంద్రబాబు నాయుడు ముందుకు ఎప్పుడో వెళ్ళిందనే వార్తలు కూడా వచ్చాయి.అయితే ఇంటిలిజెన్స్ నిర్వహించిన జిల్లాల వారీ సర్వేలో జనసేనకి మొత్తం స్థానాలకి గాను 3 నుంచీ 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని , టీడీపీ కి 55 నుంచీ 64 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇక పొతే జగన్ రెడ్డి కి 100 నుంచీ 110 వరకూ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే.

శ్రీకాకుళం : టీడీపీ(4) వైస్సార్సీపీ(6) జనసేన(0)

విజయనగరం : టీడీపీ (2) వైస్సార్సీపీ (7) జనసేన (0)

విశాఖపట్నం : టీడీపీ (5) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ఈస్ట్ గోదావరి : టీడీపీ (5) వైస్సార్సీపీ (12) జనసేన (2)

వెస్ట్ గోదావరి : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (1)

కృష్ణ : టీడీపీ (6) వైస్సార్సీపీ (10) జనసేన (0)

గుంటూరు : టీడీపీ (7) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ప్రకాశం : టీడీపీ (5) వైస్సార్సీపీ (7) జనసేన (0)

నెల్లూరు : టీడీపీ (4) వైస్సార్సీపీ (6) జనసేన (0)

కడప : టీడీపీ (3) వైస్సార్సీపీ (7) జనసేన (0)

కర్నూల్ : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (0)

అనంతపురం : టీడీపీ (9) వైస్సార్సీపీ (5) జనసేన (0)

చిత్తూరు : టీడీపీ (5) వైస్సార్సీపీ (9) జనసేన (0)

మొత్తం : టీడీపీ :(64) వైస్సార్సీపీ (108) జనసేన ( 3)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube