ఏపీలో ఇంటలిజెన్స్ సర్వే ! తెలంగాణ పోలీస్ సీరియస్  

Intelligence Survey In Ap Telangana Police Serious-elections,intelligence,majority,police,political Parties,political Updates,survey,telangana

ఎన్నికలు తంతు మొదలవ్వబోతుంది అంటే చాలు సర్వేల పేరుతో హడావుడి మొదలయిపోతుంది. ఫలానా పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఫలానా చోట ఈ పార్టీ అభ్యర్ధే గెలుస్తాడు...

ఏపీలో ఇంటలిజెన్స్ సర్వే ! తెలంగాణ పోలీస్ సీరియస్ -Intelligence Survey In AP Telangana Police Serious

మెజార్టీ ఇంత వస్తుంది. ఈ పార్టీ అధికారం లోకి రాబోతోంది. ఇలా అనేక అంశాలతో ఫలితాలను ముందుగానే అంచనా వేసి విడుదల చేస్తుంటారు.

అనేక సంస్థలు ఈ విధంగా తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తుండడంతో ఏ సర్వే నిజం ? ఏ సర్వే అబద్దం అనేది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనేక సర్వేల పేరుతో రకరకాల ఫలితాలను ప్రకటిస్తుండడంతో ఏది నిజం ఏది అబద్దం అనేది తేల్చుకోలేక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

ఎక్కడ చూసినా కూడా సర్వేల పేరుతో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు.

ఒక్కో మీడియా ఒకో విధంగా సర్వేలను బయటికి విడుదల చేస్తున్నాయి. ఏపీ లో ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల పేరుతో ఒక మీడియా ఛానల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీంతో ఏపీలో గందరగోళం చోటుచేసుకుంది.

ఈ సర్వే చూసిన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా షాక్ అయ్యారు. అసలు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీలో సర్వే నిర్వహించకపోయినప్పటికీ సర్వేల పేరుతో బయట ప్రచారం జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

అసలు ఏపీలో తాము సర్వేలు నిర్వహించకపోయినప్పటికీ తాము చేసినట్టు సర్వేలు బయటకి రావడంతో పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇంటలిజెన్స్ తరపున తాము ఎటువంటి సర్వే నిర్వహించలేదని ఇక్కడి అధికారులు వివరణ ఇస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వే పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు కూడా చేసేసారు. ఏపీ ఎన్నికలపై ఎటువంటి సర్వేలు తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించలేదు అని ఆ అధికారి తన ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు టిఎఫ్సి మీడియా సంస్థ పైన ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన శాఖమూరి తేజ బాబుతో పాటు మరి కొంత మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల సర్వే పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.