తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.
కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా డాన్సర్ గా, మెజీషియన్ గా, యాక్టర్ గా, ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్రణ వేసుకున్నాడు.ఇక బుల్లితెరపై సుధీర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఇక జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, పోవే పోరా అలాంటి ఎంటర్టైన్మెంట్ షోలు తో పాటుగా పలు సినిమాలలో హీరోగా కూడా నటించాడు.
అయితే బుల్లితెర కలిసి కలిసొచ్చినంతగా వెండితెర సుధీర్ కి అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.
ఇకపోతే ఇటీవలె సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.దీంతో అదే విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో అలాగే జబర్దస్త్ షోలో ఇప్పటికి ఎంతోమంది కమెడియన్లు సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావిస్తూ పంచులు వేశారు.
మరి ముఖ్యంగా రష్మీ ని సుదీర్ ని ఉద్దేశిస్తూ ఇప్పటికే చాలాసార్లు ఆ విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఇదే విధంగా తాజాగా కూడా జబర్దస్త్ లో మరొకసారి రష్మీ ని సుధీర్ ని ఉద్దేశిస్తూ అలాంటి కామెంట్స్ చేయడంతో సుదీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.27వ తేదీ ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
అయితే జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్స్ లలో రష్మీ టాపిక్ వచ్చినప్పుడల్లా సుధీర్ ని టార్గెట్ చేస్తున్నారు కమెడియన్స్.తాజా ప్రోమోలో రష్మీకి యువరాజు ఉండేవాడని చెబుతూ మన రాజ్యంలోనే ఉండేవాడు.పక్క రాజ్యంలో దండయాత్రకి వెళ్ళాడు.
మళ్లీ వస్తే మనవాళ్ళు దండయాత్ర చేస్తామన్నారు అని కామెంట్స్ చేశారు.దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ షో నుండి బయటికి వెళ్ళాక కొన్ని నెలలపాటు ట్రోల్స్ చేశారు.ఇప్పుడు సుధీర్ ఎవరిని కదిలించకుండా తన పని తాను చూసుకుంటున్నాడు.
ఇటువంటి సమయంలో మీరు సుధీర్ పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.