మారిషస్ అధ్యక్షుడికి విమానాశ్రయంలో చేదు అనుభవం

మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ సింగ్‌ కి వారణాసి విమానాశ్రయం లో చేదు అనుభవం ఎదురైంది.ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు.

 Insulted Air Port Security Mauritius President And His Team 1-TeluguStop.com

ఈ నేపథ్యంలో మరో ఆరుగురు ప్రతినిధులతో కలిసి వారణాసికి వచ్చిన ఆయన రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి దిల్లీ వెళ్ళడానికి విమాశ్రయానికి వచ్చారు.వారణాసిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నట్లు తెలుస్తుంది.

అయితే అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించమని కోరుతూ విమానాశ్రయ సిబ్బంది ఆపినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం తో వెంటనే కలగజేసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బందికి తగిన సూచనలు చేయడం తో అనంతరం పృథ్వీరాజ్‌ బృందం దిల్లీ బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అక్షదీప్‌ మాథుర్‌ కూడా ధ్రువీకరించారు.మారిషస్‌ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే తాను జోక్యం చేసుకున్నానని జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడారన్నారు.

భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube