డేవిడ్ వార్న‌ర్ కు అవ‌మానం.. ప్ర‌శ్నల‌ వ‌ర్షం కురిపిస్తున్న అభిమానులు

క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక ఐపీఎల్ అంటే మ‌న దేశ యూత్‌కు పెద్ద పండ‌గే అని చెప్పాలి.

 Insult To David Warner .. Fans Pouring Rain Of Questions, David Warner, Ipl,late-TeluguStop.com

అలాంటి ఐపీఎల్ టీమ్‌ల‌లో కొన్ని టీముల వారీగా అభిమానులు ఉంటారు.ఇక‌పోతే ఈ జ‌ట్ల‌కు ఎవ‌రైతే కెప్టెన్లుగా ఉంటారో వారు మ‌న దేశం వారా లేక వేరే దేవ‌స్థులా అని కూడా చూడ‌కుండా వారిని తెగ అభిమానించేస్తుంటారు.

ఇప్పుడు వార్న‌ర్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది.ఆయ‌న్ను స‌న్‌రైజ‌ర్స్ టీమ్ అభిమానులు తెగ ప్రేమించేస్తున్నారు.

కాగా ఆయ‌న విష‌యంలో ఇప్పుడు జ‌రిగిన అవ‌మానం అభిమానుల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ప్ర‌స్తుతం స‌న్ రైజర్స్ జ‌ట్టు మేనేజ్ మెంట్ డేవిడ్ వార్నర్ తో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చాలా దారుణంగా త‌యారైంది.

ఇప్ప‌టికే ఆయ‌న్ను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.మొన్న ఆడిన ఆరు మ్యాచుల్లో కేవ‌లం ఆరింటిలో మాత్ర‌మే విజ‌యం సాధించి మిగ‌త వాటిల్లో ఎక్క‌డా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేసింది.

అక్క‌డి ఆగ‌కుండా ఆయ‌న‌కు పోటీగా తీసుకొచ్చిన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ కు ప‌గ్గాలు అప్ప‌గించారు.దీంతో అప్ప‌టి నుంచే వార్న‌ర్ ప‌ట్ల మేనేజ్‌మెంట్ దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Telugu David, Fans, Insult David, Kane Vilium Son-Latest News - Telugu

కాగా ప్ర‌స్తుతం UAE లో జ‌రుగుతున్న మ్యాచుల్లో ప్లేయింగ్ XIలోకి ఎంట్రీ ఇచ్చిన వార్న‌ర్ ఆ త‌ర్వాత డ్రాప్ అయిపోయాడు.అప్ప‌టి నుంచి ఆయ‌న స్టేడియానికి వెళ్ల‌ట్లేదు.దీంతో హైద‌రాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉంటున్నారు.

వార్న‌ర్ ను ఎందుకు ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న ఇప్ప‌టికీ వ‌స్తూనే ఉంది.ఇదిలా ఉండ‌గా ఇప్పుడు హైద‌రాబాద్ మేనేజ్ మెంట్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

రీసెంట్‌గా వీడ్కోలు వీడియోను ఆరెంజ్ ఆర్మీ విడుదల చేసింది.అయితే ఈ వీడియోలో వార్నర్ లేక‌పోవ‌డం మ‌రింత ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

హైద‌రాబాద్‌కు ట్రోఫీ అందించిన వార్న‌ర్‌ను ఎలా వ‌దిలేస్తారంటూ అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube