టీడీపీ నేతల జాతకాలు బయటపెట్టే.. గవ్వల పురాణం..??     2018-11-08   13:40:56  IST  Surya Krishna

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి దాడి ఘటన పై ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. దాడి జరిగిన విధానం, ఆ దాడి వెనుక ఎవరున్నారు అనే విషయాలను ఏపీ పోలీసులు చేధించలేక పోయారని, బాబు కనుసన్నల్లోనే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడి మొత్తం శివాజీ చెప్పిన గరుడ ఆపరేషన్ లో మాదిరిగానే ఉందని ఇలాంటి సమయంలో శివాజీని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది…

Instead Of Garuda Puranam There Will Be A Gavvala Puranam-

Instead Of Garuda Puranam There Will Be A Gavvala Puranam

ఈ క్రమంలోనే జగన్ పై జరిగిన దాడి విషయాన్ని గురించి మరో నటుడు పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఒక జంతువు దెబ్బ తగిలితే చుట్టు అనేక జంతువులు చేరతాయని జంతువులకి ఉన్న కనీస మానవత్వం టీడీపీ నేతలకు లేదని, ఇదే చంద్రబాబుపై జరిగితే ఏర్పోర్ట్ లోనే రచ్చరచ్చ చేస్తారని టిడిపి పై ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేసే విధంగా ధర్మ పోరాటం అనేది ఏపీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంలోనే ఆయన శివాజీ గరుడ పురాణాన్ని ఎద్దేవా చేస్తూ మేము గవ్వల పురాణం రాస్తున్నామని త్వరలోనే గవ్వలు టీడీపీ నేతల జాతకాలు బయటపడతాయని ఒక్క గవ్వ ఒక్క నేత జాతకాలు ని బయటికి తీసుకు వస్తుందని మీది గరుడ పురాణం అయితే మాదిగల పురాణమని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఒక పక్క ప్రతిపక్ష నేత కత్తి దాడి జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే సీఎం స్థాయిలో అధికార పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు నవ్వుతూ ప్రెస్ మీట్ లు పెట్టడం ఎంతో హేయమైన చర్య అని సింపతి కోసం జగన్ నటిస్తున్నారని చంద్రబాబు అనడం చాలా దురదృష్టమని జగన్ కి సింపతి కోసం నటించాల్సిన అవసరం లేదని చంద్రబాబులా డ్రామాలు వేయడం ఆయనకు అలవాటు లేదని పృద్వి ఎద్దేవా చేశారు..

Instead Of Garuda Puranam There Will Be A Gavvala Puranam-

ఇలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికల విషయంలో సైతం పృద్వి షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది అనుకుంటున్నట్టుగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో హంగులు, బొంగులు ఏమి రావని కాంగ్రెస్ తో టిడిపి పెట్టుకున్న అక్రమ సంబంధం ఏపీలో టీడీపీ ముంచేస్తుందని. రాబోయే ఎన్నికలు వన్ సైడ్ ఉంటాయని పృద్వి చెప్పుకొచ్చారు.. అయితే పృద్వి చెప్పిన ఈ గవ్వల పురాణంలో ముందుగా ఏ టిడిపి నేత పేరు బయటకు వస్తుందోనని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు.