ముఖం కాంతివంతంగా మారటానికి ఇన్స్టెంట్ చిట్కాలు  

  • ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకోవటం సహజమే. ఇన్స్టంట్ గ్లో కోసం రకరకాల కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు. వాటికీ ఖర్చు కూడా ఎక్కువే. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటిలో ఉండే సహజమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుస్కుందాం.

  • -

  • నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖాన్ని తెల్లగా మార్చటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు స్పూన్ల నీటిని కలిపి ముఖానికి కాటన్ బాల్ సాయంతో రాసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధముగా వారంలో 2 నుండి 3 సార్లు చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ముఖానికి మాయిశ్చర్ రాయటం మర్చిపోకూడదు. టమోటా అనేది ముఖంపై మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది. ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల టమోటా రసం,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేసి ముఖానికి పట్టించి అరగంట ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
    పాలలో వైటనర్ లక్షణాలు ఉంటాయి. నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటిని ఉపయోగిస్తే ముఖం ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. స్నానం చేసే నీటిలో ఒక కప్పు పాలు, ఒక నిమ్మకాయ రసం కలిపి స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం తెల్లగా,కాంతివంతంగా మారుతుంది.