అతి త్వరలో పేటీఎంలో ఇన్స్టంట్ లోన్..!

ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.! ఋణం కోసం ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయారా.? ఇంకా అలా ఇబ్బందులు పడాలిసిన అవసరం లేదు.మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు.

 Rpaytm, Application, Instant Loan, Credit Scoe, Good News For Payment Users,new-TeluguStop.com

డబ్బులు నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లో వచ్చి పడతాయి.దానికి మీరు చేయవలిసిందల్లా ఒక్కటే.

మీ ఫోన్లో తప్పకుండా పేటీఎం యాప్ ఉండాలి.అలాగే మీరు పేటీఎం యూజర్ అయ్యి కూడా ఉండాలి.

అప్పుడే పేటీఎం నుంచి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.ఇప్పుడు ప్రముఖ పేటీఎం యాప్ త‌న యూజర్ల‌కు ఒక అదిరిపోయే ఫీచర్ తో అందుబాటులోకి రానుంది.

అది ఏంటంటే పేటీఎం యూజ‌ర్ల‌కు ఇకమీదట ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నున్నారట.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా రకాల రుణాలు ఇచ్చే యాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

కానీ వాటిల్లో చాలా యాప్స్ ఆర్‌బీఐ అనుమ‌తి లేకుండా రుణాలు ఇస్తూ చిక్కుల్లో పడుతున్నాయి.మనం కూడా డబ్బులు ముందుగా వస్తున్నాయి కదా అని తీసేసుకుంటున్నాము.

తరువాత అధిక వడ్డీలు వసూలు చేయడం షరా మాములు అయిపొయింది.

అందుకే ఈ క్రమంలో తన మార్కెట్‌ ను అభివృద్ధి చేసుకునేందుకు పేటీఎం ఇన్‌స్టంట్ లోన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

అంటే ఈ రంగంలో కూడా పేటీఎం ఆదాయన్ని రాబట్టాలని ప్లాన్ చేస్తోంది.అయితే ఇప్పటికే పేటీఎం ఇన్‌స్టంట్ లోన్స్‌ ను బీటా ద‌శ‌లో పైల‌ట్ ప్రాజెక్టు కింద కొద్ది మందికి మాత్రమే ఇచ్చింది.

ఈ ప్రక్రియ బాగా విజయవంతం అయ్యింది.దీంతో త్వ‌ర‌లోనే పేటీఎం యూజ‌ర్లంద‌రికీ ఇన్‌స్టంట్ లోన్స్ సౌక‌ర్యం అందరికీ అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

Telugu Credit, Instant Loan, Paytm-Latest News - Telugu

దీనికోసం యూజర్లు ముందుగా త‌మ వివ‌రాల‌ను తెలియ‌చేయాలి.తర్వాత ఈ – కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.అది పూర్తయిన అనంత‌రం 2 నిమిషాల్లోనే లోన్ వ‌చ్చేలా పేటీఎం ఏర్పాట్లు చేసింది.దీంతో డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో త‌క్ష‌ణ‌మే యూజ‌ర్లు రుణం పొంద‌వ‌చ్చు.ఇలా ఇన్‌స్టంట్ లోన్స్‌ కు ఇచ్చేందుకు పేటీఎం సంస్థ ప‌లు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ క్ర‌మంలో యూజ‌ర్ల‌కు చెందిన క్రెడిట్ స్కోర్‌, అలాగే పేటీఎంలో డ‌బ్బును ఏ విధంగా ఖ‌ర్చు చేస్తున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి రుణాల‌ను అందజేస్తారు.

అయితే ఈ లోన్ కోసం నేరుగా పేటీఎం యాప్‌ లోనే రుణం పొంద‌వ‌చ్చు.మరే ఇత‌ర యాప్‌ ల‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన ప‌నిలేదు.

త్వరలోనే పేటీఎం యాప్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube