ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ ఫేమస్ అయిన కేక్ ఏదో తెలుసా?

గత ఏడాది కరోనా కారణం వల్ల ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు.అదేవిధంగా బయట రెస్టారెంట్లు కూడా లేకపోవడంతో ఇంట్లోనే వారికి నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకోని తినడంలో నిమగ్నమయ్యారు.

 Instagram Viral Food Tsunami Cake Know Here Specialties Here,  Tsuname Cake Spec-TeluguStop.com

ఈ క్రమంలోనే వారిలో ఉన్న కొత్త కొత్త నైపుణ్యాలను బయటకు తీసి వివిధ రకాల వంటలను తయారు చేస్తున్నారు.ఈ విధంగా కొత్త రెసిపీ లను తయారు చేసే వారికోసం ఇప్పుడు మరొక కొత్తరకం డిష్ పరిచయం అయింది.

అదే సునామీ కేక్.ఈ కేక్ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయ్యి ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.

ఇంస్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన సునామి కేక్ ని పుల్ మీ అప్ కేక్ అని కూడా అంటారు.ఈ కేక్ అన్ని సాధారణ కేకులు మాదిరిగానే తయారుచేస్తారు.

అయితే ఈ కేక్ మధ్యలో బటర్ క్రీమ్ ఫాస్టింగ్ ఉంటుంది.ఈ కేక్ రుచి కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.

సాధారణ కేకులు అయితే కేక్ చుట్టూ స్మూత్ గా రావడం కోసం ఐసింగ్ ఉంటుంది.కానీ ఈ సునామీ కేక్ విషయంలో ఐసింగ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది.

దీనిలో ఐసింగ్ ఫ్లో అవ్వడానికి వీలుగా,కార్న్ స్టార్చ్ ని పాలతో కలపడం ద్వారా ఈ కన్సిస్టెన్సీని తీసుకు వస్తారు.

అయితే ఈ కేక్ నాలుగు వైపులా ఒక ప్లాస్టిక్ రాప్ తో కవర్ చేయవలసి ఉంటుంది.

ఈ రాప్ కేక్ కన్నా పొడువుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కేక్ పై ఐసింగ్ పూర్తి అంటుకుంటుంది.ప్లాస్టిక్ రాప్ కేక్ కంటే పొడుగ్గా ఉన్నప్పుడే ఈ రాప్ ని ఈజీగా పైకి లాగగలరు ఈ రాప్ లాగిన తరువాత కేక్ పైన ప్లాస్టింగ్ పోస్తారు.

ఫ్రాస్టింగ్ కేక్ పైనే కంటెయిన్ అయ్యి ఉండేటట్లు చూస్తారు. ఈ విధంగా సునామి కేక్ ను తయారు చేస్తారు.ప్రస్తుతం ఈ కేక్ ఎంతో పాపులర్ అయింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube