'ఇంస్టాగ్రామ్'లో అలా కామెంట్ చేస్తే అసలు కనిపించవట!

సోషల్ మీడియా.ఇది తెలియని మనిషి ఉండడు.

 Instagram, Social Media, Facebook, New Feature, Hidden Comments-TeluguStop.com

రెండేళ్ల పిల్లాడి నుంచి పండు ముసలివాడు వరకు ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయినవారే.ఇక వాట్సాప్,ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ కి అయితే ఎంతమంది అడిక్ట్ అయి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయి ఉంటారు.ఇక అలానే ఇంస్టాగ్రామ్ కు బాగా అడిక్ట్ అయ్యారు.ఫోటోలు, వీడియోలు, మిమ్స్ అంటూ ఎన్నో ఇందులో షేర్ చేస్తారు.అలా షేర్ చేసిన వాటిపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు పీట్ ఇబ్బంది పెడుతుంటారు.

కొందరు పెడితే ఓకే మరి ఎక్కువ పెడితే డిలీట్ చేసేకి అవ్వాదు.

కానీ ఇప్పుడు ఆ బాధ అక్కర్లేదు.

ఇంస్టాగ్రామ్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.వాట్సాప్, ఫేస్ బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే అద్భుతమైన కొత్త కొత్త ఫీచర్లను అందించింది.

ఇక యూ ట్యూబ్ కూడా ఒకప్పుడు కామెంట్లు కనిపించగా, ప్రస్తుతం వాటిని హైడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ కూడా యూజర్లకు కొత్త ఫీచర్ అందిస్తుంది.

ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే అదంతట అదే హైడ్ చేస్తుంది.వ్యతిరేకమైన కామెంట్లను హోల్డ్ లో పెట్టేందుకు “కామెంట్ ఫిల్టర్” అనే ఫీచర్ ను ఇంస్టాగ్రామ్ తీసుకొచ్చింది.

పోస్టులకు వ్యతిరేకమైన కామెంట్లు వస్తే కామెంట్ ఫిల్టర్ కామెంట్ ను హోల్డ్ లో పెడుతుంది.

ఇప్పుడు ఒక వ్యతిరేకమైన కామెంట్ పెడితే దానికి వెంటనే “This may go against our guidelines” మెసేజ్ వస్తుంది.

దీనితో వ్యతిరేకమైన కామెంట్లలో హైడ్ చేస్తుంది.తరువాత ఈ కామెంట్ ఉంచాలో, లేదో ఇంస్టాగ్రామ్ అడుగుతుంది.ఇక ఇది హైడ్ కాగా పోస్ట్ పై కామెంట్ కనబడదు.ఆ కామెంట్ “View Hidden comment” లో ఉంటుంది.

కాగా ప్రస్తుతం ఈ యాప్ అప్డేట్ ను ఇంస్టాగ్రామ్ అందించింది.ఇంస్టాగ్రామ్ యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి, “comment control” ను ఆఫ్ చేస్తే, వ్యతిరేక కామెంట్లను హైడ్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube