ఇన్‌స్టాగ్రాం రీల్‌ నిడివి పెరిగింది... ఇక ఎక్కువ వీడియోలు చేసుకోండి!

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రాం తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.తమ కొత్త ఫీచర్లతో ఇన్‌స్టా టిక్‌టాక్‌ యాప్‌కు గట్టి పోటీని ఇస్తోంది.

 Instagram Reels Lenghth Increased To 60 Seconds-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుందాం.ఇన్‌స్టాగ్రాం రీల్‌ వీడియోల నిడివిని పెంచింది.

దీంతో ఇక నిడివి ఉన్న వీడియోలు చేసుకోవచ్చు.ఈ కొత్త అప్డేడ్‌ను కంపెనీ ట్వీటర్‌ హ్యాండిల్‌ల్లో వెల్లడించింది.

 Instagram Reels Lenghth Increased To 60 Seconds-ఇన్‌స్టాగ్రాం రీల్‌ నిడివి పెరిగింది… ఇక ఎక్కువ వీడియోలు చేసుకోండి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సోషల్‌ మీడియా దిగ్గజం కొత్త ట్వీట్‌ ప్రకారం ఇకపై రీల్‌ గడువు 60 సెంకడ్లకు పెంచేసింది.

గతంలో ఈ రీల్స్‌ గడువు కేవలం 15 సెకండ్లు, 30 సెకండ్లు ఉండేది.

తాజాగా వీటితోపాటు 60 సెకండ్ల వీడియో లిమిట్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇంస్టాగ్రాం దాదాపు టిక్‌టాక్‌కు పోటీగా నిలుస్తోంది.ఎందుకంటే ఇటీవలె టిక్‌టాక్‌కు కూడా వీడియో నిడివిని మూడు నిమిషాలకు పెంచింది.దీంతో వినియోగదారులకు ఎక్కువ సేపు వీడియోలతో బెటర్‌గా చేసే అవకాశం ఉంటుంది.

ఇంస్టాగ్రాం టీనేజీ యూజర్లకు భద్రతను తీసుకువస్తుంది.వారికి ప్రైవేటు ఖాతాల్లోకి డిఫాల్ట్‌ చేస్తోంది.

అందుకే ఈ వారం నుంచి 16 ఏళ్లలోపు (కొన్ని దేశాల్లో 18 ఏళ్లు) ఉన్న ప్రతిఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన వెంటనే ప్రైవేటు ఖాతాలోకి డిఫాల్ట్‌ అవుతారు.ఈ కొత్త వెసులుబాటుతో యువతను ప్రకటనదారులు తమ యాడ్స్‌ ఆకట్టుకోవాలని పరిచయం చేసింది.

అంటే 18 ఏళ్లలోపు ఉన్న తమ వినియోగదారులను వయస్సు, జెండర్, లొకేషన్‌ ఆధారంగా ఇన్‌స్టాగ్రాం లక్ష్యంగా చేసుకుంది.ఇన్‌స్టాగ్రాం మరో ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.అదే ‘బోనసెస్‌’ ఫీచర్‌.దీని ద్వారా క్రియేటర్లు తమ రీల్స్‌తో డబ్బును సంపాదించుకును అవకాశం ఉంటుంది.దీన్ని అలెస్సాండ్రో పలుజ్జీ డెవలపర్‌ దీన్ని పరిశోధన చేస్తోంది.కానీ, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన స్క్రీన్‌ షాట్ల ఆధారంగా ఈ బోనస్‌ ఫీచర్‌ సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండదు అని తెలుస్తోంది.

క్రియేటర్లు తమ కొత్త రీల్స్‌ను అప్‌లోడ్‌ చేసిన వెంటనే వారికి డబ్బు చెల్లించనున్నారు.

#InstagramReel #Reels #Instagram #InstagramReeel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు