ప్రభాస్ కు ఇన్స్టాగ్రామ్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే.ప్రభాస్ అంటే ఇప్పుడు పేరు కాద .

 Instagram Dedicates New Filter To Global Star Prabhas On His Birthday, Instagram-TeluguStop.com

ఒక బ్రాండ్.ఈయన స్టార్ డమ్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్య పోతున్నారు.

ఒక సౌత్ హీరోకు ఇంతటి స్టార్ డమ్ రావడం ఇదే మొదటిసారి.బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ లో స్టార్ అయి పోయాడు.

ఇక ఈ రోజు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున విషెష్ చెబుతూ ప్రభాస్ సినిమా అప్డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను నటించే సినిమాలు నుండి ఏదొక అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.ప్రెసెంట్ ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Telugu Salaar, Adipurush, Wishes, Prabhas, Dedicatesfilter, Radheshyam-Movie

దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొక వైపు ఆదిపురుష్ సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కూడా 50 శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదే విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

Telugu Salaar, Adipurush, Wishes, Prabhas, Dedicatesfilter, Radheshyam-Movie

డి ఇలా ఉంటే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ ఆయనకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.ఇంస్టాగ్రామ్ లో గ్లోబల్ ప్రభాస్ డే అంటూ న్యూ ఫిల్టర్ ను స్టార్ట్ చేసింది.గ్లోబల్ ప్రభాస్ డే పేరుతొ రాధేశ్యామ్ మ్యూజిక్ ను ప్లే చేస్తూ చేసిన ఈ ఫిల్టర్ ప్రెసెంట్ వైరల్ అవుతుంది.డార్లింగ్ అభిమానులు కూడా ఈ ఫిల్టర్ ను ప్రభాస్ కు డేడికేట్ చేస్తూ తమ అభిమాన హీరోపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube